ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. రేపటి నుంచే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. కామెడీకి కాస్త హారర్ జోడించి ఓ డిఫరెంట్ స్టోరీతో గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Dec 23, 2025, 21:26:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఓటీటీలోకి ఈవారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు నెలన్నర రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం.

ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. రేపటి నుంచే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి
ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. రేపటి నుంచే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి

నిధియుమ్ భూతవుమ్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిధియుమ్ భూతవుమ్. ఈ సినిమా బుధవారం (డిసెంబర్ 24) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది.

“గతం మౌనంగా ఉండటానికి నిరాకరించినప్పుడు.. నిధియుమ్ భూతవుమ్ రేపటి నుంచి సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి మూవీలోని ఓ చిన్న వీడియోను జోడించింది.

నిధియుమ్ భూతవుమ్ మూవీ గురించి..

నిధియుమ్ భూతవుమ్ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. అనీష్ జీ మేనన్ ఇందులో లీడ్ రోల్లో నటించాడు. సాజన్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. టూ-వీలర్ వర్క్‌షాప్ నడుపుకునే ముగ్గురు యువకులు ఒక దెయ్యాల కొంపలో చిక్కుకునే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

'నిధియుం భూతవుం' (నిధి, భూతం అని అర్థం) పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి వస్తోంది. సినిమా కథ ప్రధానంగా ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది.

వీరు ముగ్గురూ కలిసి ఒక టూ-వీలర్ వర్క్‌షాప్ (మెకానిక్ షెడ్) నడుపుతుంటారు. అనుకోని పరిస్థితుల్లో వీరు ఒక ‘హోమ్‌స్టే’కు మకాం మారుస్తారు. అయితే ఆ ఇల్లు మామూలు ఇల్లు కాదు. అక్కడ దెయ్యాలు సంచరిస్తాయని స్థానికులు నమ్ముతుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ కుర్రాళ్ల జీవితంలో ఎలాంటి వింత సంఘటనలు, మిస్టరీ ఘటనలు జరిగాయన్నదే ఈ సినిమా కథ.

ఈ సినిమాలో నైరా నిహార్, విష్ణు గోవిందన్, వైకోమ్ భాసి, పాల్సన్, గోకులన్, రాధా గోమతి, రేష్మి అనిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More