OTT Malayalam Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్న కథాంశాలు కలిగిన సినిమాలకు ఓటీటీ ప్రియులలో ఉండే ఆదరణే వేరు. కాన్సెప్ట్ ఆధారిత థ్రిల్లర్లను ఇష్టపడే వీక్షకుల కోసం సరికొత్త మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' (It's a Medical Miracle) కొన్ని రోజుల కిందట డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. అయితే ఇన్నాళ్లూ కేవలం మలయాళం వెర్షనే ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

శ్యామిన్ గిరీష్ దర్శకత్వంలో, నిలీన్ సాండ్రా కథా రచనతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మనోరమ మ్యాక్స్' (Manorama MAX) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్లాట్, రివ్యూ వివరాలు మీకోసం.
ఇట్స్ ఎ మెడికల్ మిరాయిల్ స్టోరీ.. కోమా నుంచి బయటపడి..
ఈ సినిమా కథ అంతా రూబెన్ (సంగీత్ ప్రతాప్) అనే ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఒక దారుణమైన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రూబెన్‌ను వైద్యులు 'బ్రెయిన్ డెడ్' గా ప్రకటిస్తారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక మెడికల్ మిరాకిల్ లాగా అతను కోమా నుంచి స్పృహలోకి వస్తాడు.
అయితే కోమా నుంచి మేల్కొన్న తర్వాత రూబెన్‌కు ఒక విచిత్రమైన, అసాధారణమైన శక్తి (Superhuman Ability) లభిస్తుంది. అతని చెవులకు చుట్టుపక్కల ఉండే ప్రతి చిన్న శబ్దం అత్యంత స్పష్టంగా, విపరీతమైన తీవ్రతతో (Super-hearing) వినిపించడం ప్రారంభిస్తుంది.
ఈ ఆడియో ఓవర్‌లోడ్ కారణంగా నరకయాతన అనుభవించే రూబెన్.. ఆసుపత్రిలో తనను కోమా నుంచి బయటకు తీసుకురావడానికి కారణమైన ఒక నర్స్ వాయిస్‌ను వెతుక్కుంటూ బయలుదేరతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక ప్రమాదకరమైన నేర ప్రపంచం, పగ, ప్రతికారాల మధ్య చిక్కుకుంటాడు.
ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ ఎలా ఉందంటే?
'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' సినిమాకు ప్రధాన బలం దాని వినూత్నమైన కాన్సెప్ట్. ఒక మనిషికి వినికిడి శక్తి విపరీతంగా పెరిగితే ఎలా ఉంటుంది అనే సైంటిఫిక్ అండ్ థ్రిల్లింగ్ పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
{{/usCountry}}'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' సినిమాకు ప్రధాన బలం దాని వినూత్నమైన కాన్సెప్ట్. ఒక మనిషికి వినికిడి శక్తి విపరీతంగా పెరిగితే ఎలా ఉంటుంది అనే సైంటిఫిక్ అండ్ థ్రిల్లింగ్ పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
{{/usCountry}}ఈ సినిమాకు సౌండ్ డిజైన్, ముజీబ్ మజీద్ అందించిన నేపథ్య సంగీతం ఆక్సిజన్ లా నిలిచాయి. కథానాయకుడు సంగీత్ ప్రతాప్ తన పాత్రలోని ఒత్తిడిని, అమాయకత్వాన్ని అద్భుతంగా పండించగా.. షరాఫుద్దీన్, అఖిల భార్గవన్, కొట్టాయం నజీర్ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
అయితే ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి స్క్రీన్‌ప్లే వేగం తగ్గడం, విలన్ పాత్ర సరిగ్గా డిజైన్ కాకపోవడం కొంత నిరాశపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ, రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక కొత్త ఆడియో-విజువల్ కాన్సెప్ట్ థ్రిల్లర్‌ను ఆస్వాదించాలనుకునే తెలుగు ఓటీటీ వీక్షకులకు 'మనోరమ మ్యాక్స్' లో ఉన్న 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' ఒక మంచి వీకెండ్ చాయిస్.