...
...
Next Story

పది రోజుల్లోనే రూ.100 కోట్లు.. ప్రేమమ్ హీరో దూకుడు.. ఈ మలయాళ హారర్ కామెడీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

మలయాళం సూపర్ నేచురల్ కామెడీ మూవీ సర్వం మాయ ఇప్పుడు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. పది రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. మరి ఈ సినిమా ఏంటి? ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Jan 5, 2026, 14:34:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మలయాళ స్టార్ నివిన్ పాలీ (Nivin Pauly) స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అతడు.. తాజాగా నటించిన 'సర్వం మాయ' (Sarvam Maya) సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు దాటేసింది.

సర్వం మాయ బాక్సాఫీస్ దూకుడు ఇలా..

పది రోజుల్లోనే రూ.100 కోట్లు.. ప్రేమమ్ హీరో దూకుడు.. ఈ మలయాళ హారర్ కామెడీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
పది రోజుల్లోనే రూ.100 కోట్లు.. ప్రేమమ్ హీరో దూకుడు.. ఈ మలయాళ హారర్ కామెడీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

నివిన్ పాలీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టాడు. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన 'సర్వం మాయ' సినిమా మలయాళ ఇండస్ట్రీలో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ట్రేడ్ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

మొత్తంగా మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 106.8 కోట్లు వసూలు చేసింది. ఇక ఇండియా గ్రాస్ చూసుకుంటే రూ. 59.65 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతూ రూ. 47.15 కోట్లు రాబట్టింది. పదకొండో రోజు అయిన రెండో ఆదివారం నాడు కూడా స్ట్రాంగ్ గా నిలబడి రూ. 5.75 కోట్లు వసూలు చేసింది.

నివిన్ పాలీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తూ.. "సర్వం మాయ.. రికార్డులు బద్దలు కొడుతోంది" అని ఆనందం వ్యక్తం చేశాడు.

సర్వం మాయ సినిమా హైలైట్స్

నివిన్ పాలీ లీడ్ రోల్లో నటించిన ఈ సర్వం మాయ ఓ హారర్ కామెడీ. ప్రభేందు నంబూతిరి (నివిన్ పాలీ) అనే వ్యక్తికి తన సొంత ఊరిలో ఒక దెయ్యంతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళ మధ్య జరిగే ఫన్నీ, భయపెట్టే సంఘటనలే ఈ సినిమా కథ.

బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాస్తున్న సర్వం మాయ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజైంది. కనీసం 45 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇదే ఓటీటీలో నివిన్ పాలీ నటించిన ఫార్మా అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe