...
...
Next Story

Malayalam Thriller: చివరి నిమిషంలో ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా.. ప్లాట్‌ఫామ్ కూడా మారిపోయింది!

Malayalam Thriller: మలయాళం థ్రిల్లర్ మూవీ ధీరం ఓటీటీ రిలీజ్ డేట్ చివరి నిమిషంలో వాయిదా పడింది. నిజానికి సన్ నెక్ట్స్ ఓటీటీలోకి ఈ మూవీ శుక్రవారం (మార్చి 6) రావాల్సి ఉంది. అయితే ఎలాంటి కారణం లేకుండానే మూవీ స్ట్రీమింగ్ వాయిదా పడింది.

Published on: Mar 6, 2026, 20:28:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మలయాళ వెర్సటైల్ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ధీరం' (Dheeram) ఓటీటీ విడుదలపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా శుక్రవారం (మార్చి 6) 'సన్ నెక్స్ట్' (Sun NXT)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్లనో కానీ ఈ సినిమా ఆశించిన సమయానికి అందుబాటులోకి రాలేదు.

ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది?

Malayalam Thriller: చివరి నిమిషంలో ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా.. ప్లాట్‌ఫామ్ కూడా మారిపోయింది!
Malayalam Thriller: చివరి నిమిషంలో ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ వాయిదా.. ప్లాట్‌ఫామ్ కూడా మారిపోయింది!

నిజానికి ఫిబ్రవరి 6నే ధీరం ఓటీటీలోకి వస్తోందని అనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పటికే వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుందని, త్వరలోనే అక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై అటు నిర్మాతలనుండి గానీ, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. షేన్ నిగమ్ నటించిన 'బాల్టి' చిత్రం కూడా ప్రైమ్ వీడియోలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటం గమనార్హం. కొన్నాళ్లుగా ఈ ఓటీటీలో కొత్తగా మలయాళం మూవీస్ రావడం లేదు.

థియేటర్లలో స్పందన ఎలా ఉంది?

గతేడాది డిసెంబర్ 5న మమ్ముట్టి నటించిన 'కలంకావల్' వంటి భారీ చిత్రాలతో పాటు విడుదలైన 'ధీరం', బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఇదొక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని ప్రశంసించారు. ముఖ్యంగా ఇందులోని ఎమోషనల్ సీన్లు, హృదయాన్ని కలచివేసే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ధీరం అసలు కథేంటి?

ధీరం మూవీలో ఇంద్రజిత్ సుకుమారన్, అజు వర్గీస్, దివ్యా పిళ్లై, విజయరాఘవన్, సాగర్ సూర్య, రెబా మోనికా జాన్ లాంటి వాళ్లు నటించారు. జితిన్ సురేష్ టి మూవీని డైరెక్ట్ చేశాడు. మణికంఠన్ అయ్యప్ప మ్యూజిక్ అందించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe