ఓటీటీలోకి ఈ వారమే వస్తున్న హిట్ మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఆ ఇద్దరు పోలీసుల జీవితాలను మార్చేసిన రాత్రి
మలయాళం నుంచి మరో థ్రిల్లర్ మూవీ ఈవారం ఓటీటీలోకి వస్తోంది. జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతున్న ఆ సినిమా పేరు పాతిరాత్రి. అంటే అర్ధరాత్రి అని అర్థం. ఈ మూవీ విశేషాలు, రిలీజ్ డేట్ వివరాలను ఇక్కడ చూడండి.
ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి' (Paathirathri) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. 'పురు' (Puzhu) ఫేమ్ రతీనా పి.టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీ ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

పాతిరాత్రి ఓటీటీ రిలీజ్
మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. ఒకప్పుడు తెలుగు, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నవ్యా నాయర్.. విలక్షణ నటుడు సౌబిన్ షాహిర్ కలిసి నటించిన మూవీ ఈ 'పాతిరాత్రి'. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
పాతిరాత్రి కథ, విశేషాలు ఇవే
ఈ మూవీ టైటిల్ పాతిరాత్రి అంటే అర్ధరాత్రి అని అర్థం. పేరుకు తగినట్లే ఈ సినిమా కథ ఒక రాత్రి జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. నవ్యా నాయర్ 'ఎస్ఐ జాన్సీ'గా, సౌబిన్ షాహిర్ 'కానిస్టేబుల్ హరీష్'గా కనిపిస్తారు. వీరిద్దరూ ఒకే స్టేషన్‌లో పనిచేస్తున్నా, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాంటి వైరం ఉంటుంది.
ఒక రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా, వీరిద్దరూ ఒక ఊహించని నేరానికి సాక్షులవుతారు. అయితే ఆ విషయాన్ని పై అధికారులకు రిపోర్ట్ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడతారు. ఆ నిర్ణయం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎలా తలకిందులు చేసింది? ఆ రాత్రి వారి జీవితాల్లో మిగిల్చిన చేదు అనుభవాలు ఏంటి? అనేది ఉత్కంఠభరితంగా సాగుతుంది.
పాతిరాత్రి ఎందుకు చూడాలంటే?
మమ్ముట్టితో 'పురు' (Puzhu) వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ రతీనా పి.టి (Ratheena PT) ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఆమె టేకింగ్, పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత నవ్యా నాయర్ ఖాకీ డ్రెస్ వేసుకొని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఆమె నటన సినిమాకు ప్రధాన బలం.
ఇక 'మంజుమ్మెల్ బాయ్స్', 'ఇల వీరా పూంచిరా' వంటి సినిమాలతో ఆకట్టుకున్న సౌబిన్ షాహిర్.. ఇందులో మరోసారి సీరియస్ పోలీస్ పాత్రలో తనదైన నటన కనబరిచాడు. ఈ సినిమాలో సన్నీ వేన్, ఆన్ అగస్టిన్, హరిశ్రీ అశోకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోలీస్ ప్రొసీజరల్ డ్రామాలు, థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి 'పాతిరాత్రి' ఒక మంచి ఛాయిస్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


