ఈ వారం మరో మలయాళ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. ఈ సినిమా పేరు ‘శేషిప్పు’ (Sheshippu). కేరళ ఫిల్మ్ ఫెస్టివల్లో మూవీని ప్రదర్శించిన తర్వాత థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే తీసుకు రావడం విశేషం.
‘శేషిప్పు’ ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?

ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా శేషిప్పు ఆన్‌లైన్ అరంగేట్రం వివరాలు ఈ వారం ప్రారంభంలోనే ఖరారయ్యాయి. 2025లో జరిగిన కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFK)లో ఈ సినిమా ప్రదర్శనను మిస్ అయిన వారు.. దీని ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వారం వేరే ఇతర మలయాళ సినిమాలు ఆన్‌లైన్‌లోకి రాలేదు. దీంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శేషిప్పు’ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఈమధ్యే సన్ నెక్స్ట్ (Sun NXT)లో విడుదలైన మలయాళ సినిమాలలో 'ఇత్తిరి నేరం', 'కిర్క్కన్', 'నిధియుమ్ భూతవుమ్' ఉన్నాయి. ఇప్పుడీ శేషిప్పులో ఫిమేల్ లీడ్ గా నటించిన మీనాక్షి జయన్ మరో సినిమా 'విక్టోరియా' థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇంకా ఓటీటీలోకి రాలేదు.
‘శేషిప్పు’ కథ, ఇతర వివరాలు
‘శేషిప్పు’ అనేది ఒంటరితనం, నోస్టాల్జియా చుట్టూ తిరిగే కథ. ఈ సినిమాలో పెద్దగా పేరున్న నటీనటులు లేరు. ఇది కూడా ఈ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకురావడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
సినిమాలోని ప్రధాన పాత్ర ఒక ఒంటరి ఘోస్ట్ రైటర్. అతను ఒక మానసిక వేదనలో ఉన్న మహిళను కలుస్తాడు. ఈ ఇద్దరూ ఒకచోట చేరినప్పుడు వారిద్దరి మధ్య ఊహించని బంధం ఏర్పడుతుంది. వారు తమ బాధలను పంచుకోవడం ద్వారా ఒకరికొకరం అనే భావన పొందుతారు.
కేవలం గంటా ఇరవై ఐదు నిమిషాల నిడివి గల ఈ సినిమాలో మీనాక్షి జయన్, రషీద్ రెహమాన్, రాజన్ పూతవక్కల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్లు శ్రీజిత్ ఎస్ కుమార్, గ్రిట్టో విన్సెంట్ డైరెక్ట్ చేశారు.
{{/usCountry}}కేవలం గంటా ఇరవై ఐదు నిమిషాల నిడివి గల ఈ సినిమాలో మీనాక్షి జయన్, రషీద్ రెహమాన్, రాజన్ పూతవక్కల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కొత్త డైరెక్టర్లు శ్రీజిత్ ఎస్ కుమార్, గ్రిట్టో విన్సెంట్ డైరెక్ట్ చేశారు.
{{/usCountry}}