Mammootty: నాలుగోసారి నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్.. బాలీవుడ్ హీరోతో కలిసి.. ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుక

Mammootty: నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుకలు గుజరాత్ లోని స్టాచూ ఆఫ్ యూనిటీ దగ్గర ఘనంగా జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నాలుగోసారి నేషనల్ అవార్డు అందుకోగా.. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కు కూడా ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

Published on: Sep 22, 2026, 18:21:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mammootty: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత పురస్కారాలైన జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఏక్తా నగర్‌లో జరిగిన ఈ వేడుకలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఉమ్మడిగా ఉత్తమ నటుడి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను అందుకున్నారు.

Mammootty: నాలుగోసారి నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్.. బాలీవుడ్ హీరోతో కలిసి.. ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుక (@PresidentOfIndia)
Mammootty: నాలుగోసారి నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్.. బాలీవుడ్ హీరోతో కలిసి.. ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల వేడుక (@PresidentOfIndia)

భారతీయ సినిమా విభిన్న సంస్కృతులను, ప్రతిభను ఒకటిగా కలిపే క్రమంలో ఈ ఏడాది హిందీ, మలయాళం నటులు ఒకే వేదికపై ఈ గౌరవాన్ని పంచుకోవడం విశేషం.

మమ్ముట్టికి స్టాండింగ్ ఓవేషన్.. వేదికపై అపూర్వ గౌరవం

మలయాళ సీనియర్ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి వేదికపైకి రాగానే ఆడిటోరియం అంతా ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. అక్కడ ఉన్న ప్రముఖులందరూ లేచి నిలబడి ఆయనకు 'స్టాండింగ్ ఓవేషన్' ఇచ్చి ఘనంగా గౌరవించారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఏకంగా నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకుని మమ్ముట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.

పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో పీరియాడిక్ ఫోక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి చూపించిన విశ్వరూపానికి ఈ పురస్కారం దక్కింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కొడుమోన్ పొట్టిగా మమ్ముట్టి చేసిన నెగెటివ్ ఛాయలున్న పాత్ర నభూతో నభవిష్యత్ అనిపించింది.

మమ్ముట్టి ఏమన్నారంటే?

రెడ్ కార్పెట్ మీద మమ్ముట్టి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. "దేశం నుంచి ఇలాంటి పెద్ద గుర్తింపు దక్కడం ప్రతీ యాక్టర్‌కి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నా లైఫ్‌లో ఇది నాలుగో జాతీయ అవార్డు కావడం నా అదృష్టం. ఇన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరించడం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది" అని తెలిపారు.

తన యాక్టింగ్ గురించి చెప్తూ.. "ముందుగా మంచి స్క్రిప్ట్, ఆ తర్వాతే నా క్యారెక్టర్ ఎంచుకుంటాను. సెట్‌కి వెళ్లేముందు నేను పెద్దగా ప్రిపరేషన్స్ ఏమీ చేయను. ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని అనను కానీ లక్కీగా సీన్స్ అలా కుదిరిపోతాయి. నా డైరెక్టర్, మేకప్ డిజైనర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు" అంటూ క్రెడిట్ మొత్తం టీమ్‌కి ఇచ్చారు. గతంలో మమ్ముట్టి 'మథిలుకల్', 'పొంతన్ మాడ', 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్' చిత్రాలకు గానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.

తొలి జాతీయ పురస్కారంతో కార్తీక్ ఆర్యన్

మరోవైపు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 'చందూ ఛాంపియన్' సినిమాలో కనబరిచిన అద్భుత నటనకు గానూ తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. నల్లటి క్లాసీ సూట్‌లో ఎంతో డాషింగ్‌గా కనిపించిన కార్తీక్.. రాష్ట్రపతి చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేముందు ఆడిటోరియంలోని ప్రేక్షకులకు నమస్కరిస్తూ అభివాదం చేశారు.

భారత తొలి పారా ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ బయోపిక్‌గా ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ఈ చిత్రాన్ని చెక్కారు. ఈ పాత్ర కోసం కార్తీక్ పడిన ఫిజికల్ కష్టం, అంకితభావం, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆడియన్స్‌ని, జ్యూరీ సభ్యులను ఎంతగానో మెప్పించింది.

చందూ ఛాంపియన్‌పై కార్తీక్ ఆనందం

అవార్డ్ అందుకున్న అనంతరం కార్తీక్ మాట్లాడుతూ, "చందూ ఛాంపియన్ మూవీకి నాకు తొలి నేషనల్ అవార్డ్ రావడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. మా ఫ్యామిలీ, టీమ్ అంతా పండగ చేసుకుంటున్నారు. పారా అథ్లెట్లకు ఈ సినిమా ఇచ్చిన స్పూర్తి ఎంతో గొప్పది. మమ్మల్ని ఎన్నుకున్న జ్యూరీకి, ఆదరించిన ఇండియన్ ఆడియన్స్‌కి నా థ్యాంక్స్" అని చెప్పారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శన, అక్కడ రుచికరమైన లోకల్ ఫుడ్ తిన్న ఫోటోలను కూడా కార్తీక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More