Padma Awards 2026: పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టి.. ధురంధర్ స్టార్ మాధవన్‌కు పద్మశ్రీ

Padma Awards 2026: పద్మ అవార్డులు అందుకున్నారు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు. మంగళవారం (జూన్ 23) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, మాధవన్ లాంటి వాళ్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.

Published on: Jun 23, 2026, 19:37:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Padma Awards 2026: దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం మంగళవారం (జూన్ 23) సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన రెండవ సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో సినీ, సంగీత, నాటక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు.

Padma Awards 2026: పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టి.. ధురంధర్ స్టార్ మాధవన్‌కు పద్మశ్రీ (PTI)
Padma Awards 2026: పద్మ భూషణ్ అందుకున్న మమ్ముట్టి.. ధురంధర్ స్టార్ మాధవన్‌కు పద్మశ్రీ (PTI)

ఈ ప్రతిష్టాత్మక వేడుకలో మలయాళ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి, ప్రముఖ సింగర్ అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అందుకోగా.. వర్సటైల్ యాక్టర్ ఆర్‌ మాధవన్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.

పద్మభూషణ్‌తో మెరిసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి

74 ఏళ్ల మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి విశిష్ట ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. మమ్ముట్టి అవార్డు స్వీకరిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఆయన కుమారుడు, పాన్ ఇండియా నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఎంతో గర్వంగా చప్పట్లు కొడుతూ తండ్రిని ఎంకరేజ్ చేయడం వేడుకలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో 400 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి లెజెండ్ గా ఎదిగిన మమ్ముట్టి.. ఇప్పటివరకు మూడు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. 1989 లో 'ఓరు వడక్కన్ వీరగథ', 'మతిలుకల్' చిత్రాలకు గాను ఆయన మొదటి నేషనల్ అవార్డు అందుకోగా.. ఆ తర్వాత 'విధేయన్', 'పొంతన్ మాద' సినిమాలకు రెండోసారి విజేతగా నిలిచారు. 1999 లో బి.ఆర్. అంబేద్కర్ బయోపిక్ 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్' లో ఆయన చేసిన అద్భుత నటనకు మూడవసారి జాతీయ అవార్డు దక్కింది.

సింగర్ అల్కా యాగ్నిక్‌కు పద్మభూషణ్ గౌరవం

భారతీయ సంగీత ప్రపంచంలో తన మధురమైన గొంతుతో దశాబ్దాల పాటు అలరించిన సీనియర్ గాయని అల్కా యాగ్నిక్ (Alka Yagnik) పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సాంగ్స్ పాడిన ఆమె ఖాతాలో.. 'ఖల్‌నాయక్' లోని చోలి కే పీచే, 'దడ్కన్' లోని దిల్ నే యే కహా హై దిల్ సే, 'హమ్ తుమ్' టైటిల్ ట్రాక్, 'కుచ్ కుచ్ హోతా హై' వంటి ఎవర్ గ్రీన్ మెలోడీస్ ఉన్నాయి.

మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారం

టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడైన స్టార్, ధురంధర్ మూవీ యాక్టర్ ఆర్‌ మాధవన్ (R Madhavan) రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకునే సమయంలో ఎంతో ఎమోషనల్ గా కనిపించారు. ఈ వేడుకకు ఆయన భార్య సరిత, కుమారుడు వేదాంత్ కూడా హాజరయ్యారు. మాధవన్ స్టేజ్ పైకి వెళ్లగానే భార్యాకొడుకులు ఇద్దరూ లేచి నిలబడి సంతోషంతో చప్పట్లు కొట్టారు. అవార్డు అందుకున్న అనంతరం మాధవన్ పీఎం నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ పురస్కారంపై మాధవన్ స్పందిస్తూ.. "దీన్ని నేను కేవలం ఒక అవార్డులా కాకుండా సమాజం పట్ల నాకున్న బాధ్యతగా భావిస్తున్నాను. ఈ గౌరవాన్ని ఎంతో నిబద్ధతతో, వినయంతో కాపాడుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ గుర్తింపునకు నా హృదయం కృతజ్ఞతలతో నిండిపోయింది" అని ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన మాధవన్.. రీసెంట్ గా రణవీర్ సింగ్ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీ 'ధురంధర్: ది రివెంజ్' లో పవర్‌ఫుల్ రోల్ లో కనిపించారు. ఆయన మొదటిసారి లాంచ్ చేసిన డైరెక్టోరియల్ డెబ్యూ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రానికి గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ఏడాది మొత్తం 131 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా.. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మొదటి విడత ప్రదానోత్సవ వేడుక మే 25న జరిగింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More