Madhavan: సెక్స్, కండోమ్ వాడకం గురించి కొడుకుతో మాట్లాడతా.. షాకింగ్ విషయాలు పంచుకున్న మాధవన్
Madhavan: నటుడు మాధవన్ తన కొడుకు వేదాంత్‌ను పెంచిన తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిన్నప్పటి నుంచే లైంగిక స్పర్శ, జాగ్రత్తల గురించి చర్చించానని, అతడిని ఒక బాధ్యత గల వ్యక్తిగా మార్చడమే తన ఉద్దేశమని వెల్లడించాడు.
Madhavan: సినీ పరిశ్రమలో చాక్లెట్ బాయ్‌గా, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్.మాధవన్ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా తన కుమారుడు వేదాంత్ ఎదుగుదల వెనుక ఉన్న పేరెంటింగ్ సీక్రెట్స్ పంచుకున్నాడు. సెక్స్, కండోమ్ వాడకం గురించి కూడా తన కొడుకుతో మాట్లాడతానని మాధవన్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇప్పుడు ఇది నెట్టింట చర్చనీయాంశమైంది.

మాధవన్ కామెంట్లు
ప్రముఖ తమిళ పత్రిక 'కుముదం'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ తన పేరెంటింగ్ శైలి గురించి కీలక విషయాలు వెల్లడించాడు. వేదాంత్ చాలా చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే తను అతడిని ఒక పిల్లాడిలా కాకుండా, ఒక పరిణతి చెందిన వ్యక్తిలా భావించేవాడినని మాధవన్ చెప్పాడు.
సెక్స్, కండోమ్
"నా కొడుకుకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే నేను తనతో ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా మాట్లాడటం మొదలుపెట్టా. లైంగిక స్పర్శ (Sexual touch), ఎదుటివారికి ఇవ్వాల్సిన గౌరవం, చివరకు సెక్స్, కండోమ్స్ వాడకం వంటి సున్నితమైన అంశాలపై కూడా మేము చర్చించుకుంటాం" అని మాధవన్ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.
ఓపెన్ గా ఉండటంతో
పిల్లలతో ఇలాంటి విషయాలు మాట్లాడటం వల్ల వారిలో బాధ్యత పెరుగుతుందని మాధవన్ నమ్ముతున్నాడు. "నేను తనతో ఇంత ఓపెన్‌గా ఉండటం వల్ల వేదాంత్‌లో నాపై నమ్మకం పెరిగింది. మా నాన్న నన్ను గౌరవిస్తున్నారు, ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నారు అనే భావన తనలో కలిగింది. ఆ గౌరవమే తనను మరింత బాధ్యతాయుతమైన పౌరుడిగా మార్చడానికి సహాయపడింది" అని మాధవన్ చెప్పుకొచ్చాడు.
సాధారణంగా సమాజంలో లైంగిక విద్య లేదా భద్రత గురించి మాట్లాడటానికి తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. కానీ, పిల్లలు పెద్దయ్యే వరకు వేచి చూడకుండా, సరైన సమయంలో సరైన విషయాలు చెప్పడమే ఉత్తమమని మాధవన్ అభిప్రాయపడ్డాడు.
వేదాంత్ ప్రస్థానం
మాధవన్ కుమారుడు వేదాంత్ కేవలం స్టార్ కిడ్ అనే గుర్తింపుకే పరిమితం కాలేదు. అతను ఒక ఛాంపియన్ స్విమ్మర్. ఇంటర్నేషనల్ లెవల్ లో ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిని చాటాడు. అంతర్జాతీయ ఈవెంట్లలో వేదాంత్ పతకాలు సాధించడం వెనుక మాధవన్ దంపతుల ప్రోత్సాహం ఎంతో ఉంది. కుమారుడి కెరీర్ కోసం మాధవన్ దుబాయ్‌కు షిఫ్ట్ అవ్వడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం మాధవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలతో దాపరికం లేకుండా ఉండటం వల్ల వారు పెడదోవ పట్టకుండా ఉంటారని నెటిజన్లు మాధవన్ అప్రోచ్‌ను ప్రశంసిస్తున్నారు. తాజాగా ధురంధర్ సినిమాల్లో తన యాక్టింగ్ తో మాధవన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: మాధవన్ తన కొడుకుతో ఏయే అంశాలపై చర్చిస్తాడు?
జవాబు: లైంగిక స్పర్శ, పరస్పర గౌరవం, సెక్స్, కండోమ్స్ వాడకం వంటి సున్నితమైన విషయాలపై మాధవన్ తన కొడుకుతో చిన్నప్పటి నుంచే చర్చిస్తున్నాడు.
ప్రశ్న: వేదాంత్ మాధవన్ వృత్తి ఏమిటి?
జవాబు: వేదాంత్ మాధవన్ ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్. అతను భారత దేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని పలు పతకాలను గెలుచుకున్నాడు.
ప్రశ్న: పిల్లల పెంపకంపై మాధవన్ అభిప్రాయం ఏమిటి?
జవాబు: పిల్లలతో కఠినమైన లేదా ఇబ్బందికరమైన విషయాలను దాచకుండా.. వారితో పారదర్శకంగా మాట్లాడటం వల్ల వారిలో బాధ్యత, నమ్మకం పెరుగుతాయని మాధవన్ భావిస్తాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


