Manchu Manoj: ఆయన దగ్గరికి మైక్ పట్టుకొని వెళ్లొద్దు.. హెల్మెట్ పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ: మంచు మనోజ్

Manchu Manoj: మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన తండ్రి మోహన్ బాబుపై పంచులు వేయడంతోపాటు వచ్చే ఎన్నికల్లో తన భార్య మౌనిక పోటీ చేస్తుందని కూడా చెప్పడం విశేషం. అతని నెక్ట్స్ మూవీ డేవిడ్ రెడ్డి ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడాడు.

Published on: May 19, 2026, 15:23:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Manchu Manoj: మంచు ఫ్యామిలీ వారసులలో ఒకడైన మంచు మనోజ్ త్వరలోనే డేవిడ్ రెడ్డి అనే మూవీతో వస్తున్న విషయం తెలుసు కదా. ఈ మధ్యే మూవీ టీజర్ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్.. తన తండ్రి మోహన్ బాబుపై చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Manchu Manoj: ఆయన దగ్గరికి మైక్ పట్టుకొని వెళ్లొద్దు.. హెల్మెట్ పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ: మంచు మనోజ్
Manchu Manoj: ఆయన దగ్గరికి మైక్ పట్టుకొని వెళ్లొద్దు.. హెల్మెట్ పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ: మంచు మనోజ్

ఆయన దగ్గరికి మైక్ తీసుకొని తీసుకెళ్లొద్దు..

మంచు మనోజ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఓ రిపోర్టర్ తన తండ్రి మోహన్ బాబుతో గొడవలు సద్దుమణిగినట్లేనా అని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించాడు.

“అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా.. అక్కడికెళ్లి అడగండి.. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మైక్ తీసుకొని వెళ్లకండి.. అలాగే హెల్మెట్ వేసుకొని వెళ్లండి” అని అతడు బిగ్గరగా నవ్వాడు. దీంతో అక్కడున్న వాళ్లు కూడా నవ్వేశారు.

గతంలో మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఇంట్లోకి మీడియా ప్రతినిధులు వెళ్లినప్పుడు ఓ రిపోర్టర్ పై అతడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రిపోర్టర్ చేతుల్లోని మైక్ తీసుకొని అతని తలపై బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటనను ఉద్దేశించే మనోజ్ ఇప్పుడీ కామెంట్స్ చేశాడు.

నా భార్య పోటీ చేస్తుంది

ఇక రాజకీయాల గురించి కూడా మంచు మనోజ్ స్పందించాడు. రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించినప్పుడు.. “రాజకీయాల్లోకి కొత్తగా రావడమేంటన్న.. పుట్టినప్పటి నుంచి దాంట్లోనే కదా ఉన్నాము” అని అన్నాడు. మరి ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే.. జనాల పార్టీలో ఉన్నామని మనోజ్ నవ్వుతూ చెప్పాడు. ఈ సందర్భంగా తన భార్య భూమా మౌనిక రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా అతడు స్పష్టం చేయడం గమనార్హం.

మనోజ్ ఐక్య ఫౌండేషన్

ఇక మంచు మనోజ్ ఈ మధ్యే ఐక్య అనే ఫౌండేషన్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తానని కూడా అతడు వెల్లడించాడు. మరోవైపు అతడు నటిస్తున్న డేవిడ్ రెడ్డి మూవీ నుంచి రెండు రోజుల కిందట టీజర్ రిలీజైంది. ఇది గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. డేవిడ్ రెడ్డి ఇండియా అంటూ చివర్లో మనోజ్ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More