Manchu Manoj: పోత‌రాజు బ్యాక్‌డ్రాప్‌లో మంచు మ‌నోజ్ డివోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. బిగ్ స్క్రీన్‌పై పూన‌కాలే!

Manchu Manoj: డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేయడంతో పాటు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ తో మంచు మనోజ్ దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. దసరా సందర్భంగా మేకర్స్ ఇవాళ బిగ్ అప్డేట్ ఇచ్చారు. పోతరాజు బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. 

Published on: Oct 20, 2026, 13:30:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Manchu Manoj: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన కథలు, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కిస్తున్నారు.

పోత‌రాజు బ్యాక్‌డ్రాప్‌లో మంచు మ‌నోజ్ డివోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. బిగ్ స్క్రీన్‌పై పూన‌కాలే! (x/HeroManoj1)
పోత‌రాజు బ్యాక్‌డ్రాప్‌లో మంచు మ‌నోజ్ డివోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. బిగ్ స్క్రీన్‌పై పూన‌కాలే! (x/HeroManoj1)

కొత్త గెటప్ లో మంచు మనోజ్

RPA క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ను మునుపెన్నడూ చూడని కొత్త రూపంలో ఆడియన్స్ చూడబోతున్నారని టాక్. ‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్పీ అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూరి శిష్యుడు

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు మంచు మనోజ్‌ తన కెరీర్ లో చేయని కొత్త పాత్ర ఇది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సరికొత్త అవతార్‌లో మంచు మనోజ్ అదరగొడతారని అంటున్నారు.

పోతరాజు బ్యాక్ డ్రాప్ లో

పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలంగాణ పండుగల వైభవం, సంప్రదాయాల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది.

ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

మంచు మనోజ్ సినిమాలు

మధ్యలో ఏడేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ తిరిగి 2025లో భైరవం మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మిరాయ్ లో విలన్ గా అదరగొట్టారు. బ్లాక్ స్వార్డ్ గెటప్ లో యాక్టింగ్ ఇరగదీశారు. ఈ మూవీ సక్సెస్ తో మంచు మనోజ్ కెరీర్ మరో టర్న్ తీసుకుంది.

ఇప్పుడు మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసుల వాడ, అహం బ్రహ్మాస్మి సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇక బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న దాదా మూవీతో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More