Inji Vellam Release Date: వెండితెరపై ప్రేమకథలను అత్యంత కవితాత్మకంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించడంలో దర్శకుడు మణిరత్నం స్టైలే వేరు. గతంలో ఆయన తెరకెక్కించిన 'మౌనరాగం', 'గీతాంజలి', 'సఖి' , 'ఓ కాదల్ కన్మణి' చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో క్లాసిక్ రొమాంటిక్ సినిమాలుగా నిలిచిపోయాయి.

ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ డ్రామా జోనర్‌లోనే 'ఇంజి వెల్లం' చిత్రంతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి మణిరత్నం సిద్ధమయ్యారు.
'ఇంజి వెల్లం' అర్థమేంటి? మోషన్ పోస్టర్‌లో ట్విస్ట్ ఇదే!
తమిళంలో 'ఇంజి వెల్లం' అంటే తెలుగులో ‘అల్లం బెల్లం’ అని అర్థం. తీపి, ఘాటు కలయికలాగే.. పూర్తి భిన్నమైన మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే అందమైన ప్రేమ, దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ టైటిల్‌ను ఖరారు చేశారు.
విడుదల తేదీ ప్రకటన సందర్భంగా మద్రాస్ టాకీస్ విడుదల చేసిన షార్ట్ మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి భార్యాభర్తలుగా కనిపిస్తుండగా.. వారి చేతుల్లో ఇద్దరు కవల పిల్లలు ఉండటం విశేషం.
"ఇందులో ఎవరు ఇంజి, ఎవరు వెల్లం? మీ కుటుంబంతో దిగిన సరదా ఫొటోలను షేర్ చేయండి" అంటూ మద్రాస్ టాకీస్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా పోస్ట్ చేసింది.
కోల్‌కతా హౌరా బ్రిడ్జ్ లీక్డ్ ఫొటోలు.. క్లీన్ షేవ్ లుక్‌లో సేతుపతి!
ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను కోల్‌కతా నగరంలో చిత్రీకరించారు. గత ఏడాది జులైలో కోల్‌కతాలోని ప్రఖ్యాత హౌరా బ్రిడ్జ్ వద్ద షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోలలో విజయ్ సేతుపతి పూర్తి క్లీన్-షేవ్ లుక్‌లో బ్లాక్ టీ-షర్ట్, జీన్స్, వైట్ స్నీకర్స్ ధరించి చాలా యంగ్‌గా కనిపించారు. మరోవైపు సాయి పల్లవి బ్రౌన్ కలర్ ఫ్లోయింగ్ డ్రెస్‌లో, తన సహజమైన కర్లీ హెయిర్‌తో ఎంతో అందంగా మెరిసిపోయారు. మణిరత్నం వారికి సన్నివేశాన్ని వివరిస్తున్న తీరు చూస్తుంటే, అక్కడ ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది.
ఫుల్ ఫామ్‌లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి
{{/usCountry}}ఆ ఫొటోలలో విజయ్ సేతుపతి పూర్తి క్లీన్-షేవ్ లుక్‌లో బ్లాక్ టీ-షర్ట్, జీన్స్, వైట్ స్నీకర్స్ ధరించి చాలా యంగ్‌గా కనిపించారు. మరోవైపు సాయి పల్లవి బ్రౌన్ కలర్ ఫ్లోయింగ్ డ్రెస్‌లో, తన సహజమైన కర్లీ హెయిర్‌తో ఎంతో అందంగా మెరిసిపోయారు. మణిరత్నం వారికి సన్నివేశాన్ని వివరిస్తున్న తీరు చూస్తుంటే, అక్కడ ఒక రొమాంటిక్ పాటను చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది.
ఫుల్ ఫామ్‌లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి
{{/usCountry}}ఈ క్రేజీ కాంబినేషన్‌కు తోడు హీరోహీరోయిన్లు ఇద్దరూ ప్రస్తుతం కెరీర్ పరంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
విజయ్ సేతుపతి: ఇటీవల ఆయన నటించిన ఎమోషనల్ డ్రామా 'బత్తా' (Baththa) థియేటర్లలో మంచి విజయం సాధించడమే కాకుండా, గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
2. సాయి పల్లవి: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తున్న 'రామాయణం పార్ట్ 1'లో సీతాదేవిగా సాయి పల్లవి నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ధనుష్, మమ్ముట్టి, శ్రీలీలతో కలిసి ఆమె నటించిన తమిళ చిత్రం 'ఓం' (OM) నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఏఆర్ రెహమాన్ మాయాజాలం, దానికి తోడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి అద్భుతమైన నటులు తొలిసారి జతకట్టడంతో 'ఇంజి వెల్లం' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే సినీ ప్రియులకు ఇదొక మధురమైన ప్రేమకావ్యంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.