Matsya Glimpse: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మైథాలజీ కాన్సెప్ట్ లతో వచ్చే విజువల్ అడ్వెంచర్ సినిమాలకు ఇప్పుడున్న క్రేజ్ వేరు. సరిగ్గా ఇదే టైమ్ లో డెబ్యూ హీరో వివస్వాన్ నటించిన 'మత్స్య' మూవీ గ్లింప్స్ ఆడియెన్స్ ముందుకొచ్చి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నపిల్లల బెడ్ టైమ్ స్టోరీలా మొదలై, ఊహకందని డిఫరెంట్ ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన ఈ గ్లింప్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది.
వివస్వాన్ స్టైలిష్ లుక్.. సూపర్ ఆటిట్యూడ్

జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్న ఈ భారీ కాన్సెప్ట్ మూవీకి రవి గోలి, తేజ కనకాల సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త కుర్రాడు వివస్వాన్ ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. గ్లింప్స్ లో అతడి బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే ఆటిట్యూడ్ టాలీవుడ్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
మామూలుగా డెబ్యూ హీరో అనగానే రొటీన్ లవ్ స్టోరీ లేదా రొటీన్ యాక్షన్ డ్రామా ఎంచుకుంటారు. కానీ వివస్వాన్ మాత్రం డిఫరెంట్ గా మైథాలజీ బ్యాక్ డ్రాప్ ఉన్న విజువల్ అడ్వెంచర్ తో రిస్క్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి యంగ్ లుక్, కాన్ఫిడెంట్ యాక్టింగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
మైథాలజీ ఫాంటసీ వరల్డ్.. మెస్మరైజ్ చేస్తున్న విజువల్స్
ఈ గ్లింప్స్ లో చూపించిన ఫ్రేమ్స్ సినిమా స్కేల్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక పక్క మిస్టరీ, మరోపక్క రహస్య ప్రపంచంలో ఉండే వింత జీవులు, రహస్యాల చుట్టూ తిరిగే కథాంశం ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది. కేవలం మాస్ యాక్షన్ సీన్ల మీదే డిపెండ్ అవ్వకుండా, కంటెంట్ బేస్డ్ విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
కెమెరామెన్ సురేష్ సారంగం అందించిన సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్ గుప్తా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ మిస్టరీ వాతావరణానికి సరిగ్గా సరిపోయి, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది.
క్లైమాక్స్ లో 'విజువల్ షాక్'.. ఆ రాకాసి తిమింగలం వీఎఫ్ఎక్స్ కేక
{{/usCountry}}కెమెరామెన్ సురేష్ సారంగం అందించిన సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్ గుప్తా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ మిస్టరీ వాతావరణానికి సరిగ్గా సరిపోయి, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది.
క్లైమాక్స్ లో 'విజువల్ షాక్'.. ఆ రాకాసి తిమింగలం వీఎఫ్ఎక్స్ కేక
{{/usCountry}}గ్లింప్స్ చివర్లో వచ్చే సీన్ అద్భుతం అని చెప్పాలి. సముద్రంలో నుంచి భారీ రాకాసి తిమింగలం (Giant Whale) బయటకొచ్చే వీఎఫ్ఎక్స్ షాట్ ఆడియెన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కొత్త మేకర్స్ అయినప్పటికీ గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ వాడటం గమనార్హం.
'కార్తికేయ 2', 'హనుమాన్' లాంటి సినిమాలు మైథాలజీ, అడ్వెంచర్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయో మనకు తెలిసిందే. ఇప్పుడు 'మత్స్య' కూడా అదే తరహాలో కొత్త కంటెంట్ తో ఇండియన్ సినిమా స్కేల్ లో మెప్పించేలా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో జీబీఆర్ ప్రొడక్షన్స్ పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్ లో రిచ్ గా కనిపిస్తోంది.
మొత్తానికి 'మత్స్య' గ్లింప్స్ తోనే మేకర్స్ తమ విజన్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. డిఫరెంట్ కథలను ఆదరించే నేటి మూవీ లవర్స్ కి ఈ కొత్త మైథాలాజికల్ అడ్వెంచర్ కచ్చితంగా ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనడంలో సందేహం లేదు.