Maya Lady Trailer: రూప, ఆశ.. ప్రేమించింది ఎవరిని? ట్విన్స్ లవ్‌లో పిచ్చోడైన కుర్రాడు.. మాయ లేడీ ట్రైలర్ చూశారా?
Maya Lady Trailer: తెలుగులో మరో రొమాంటిక్ డ్రామా మూవీ వస్తోంది. ట్విన్స్ ప్రేమలో పడి పిచ్చోడైన కుర్రాడి చుట్టూ తిరిగే కథతో వస్తున్న ఈ మూవీ పేరు మాయ లేడీ. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది.
Maya Lady Trailer: యువ హీరో రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మించిన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మాయ లేడీ’. గురువారం (నవంబర్ 5) వైభవంగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

లవ్, రొమాన్స్, కవల అక్కాచెల్లెళ్ల గందరగోళం, కమెడియన్ సత్య మార్క్ హ్యూమర్‌తో కూడిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రసన్నకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కరాటే కోచ్ లవ్ స్టోరీ.. ఊహించని ట్విన్స్ ట్విస్ట్
‘మాయ లేడీ’ స్టోరీ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఇందులో లీడ్ రోల్ క్రిష్ (రాకేష్ వర్రే) ఒక నిబద్ధత కలిగిన కరాటే కోచ్. పెళ్లి చేసుకోవడానికి సరైన అమ్మాయి కోసం వెతుకుతున్న క్రిష్‌కి ఆశ (మధుమిత సర్కార్) పరిచయం అవుతుంది. ఆమె క్యూట్ బిహేవియర్, ఎనర్జీ, వైబ్‌కి ఫిదా అయిపోయి ఆమెతో ప్రేమలో పడతాడు.
అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో ఆమె కవల సోదరి రూపా ఎంట్రీ ఇస్తుంది. ఆశా, రూపా ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ, ప్రవర్తనలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఈ ట్విన్ సిస్టర్స్ మధ్య చిక్కుకున్న క్రిష్ పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారుతుంది. చివరికి క్రిష్ ఈ విచిత్ర సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనే సస్పెన్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ కట్‌ను అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
కమెడియన్ సత్య పంచ్‌లు..
ఈ మాయ లేడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా కమెడియన్ సత్య కామెడీ నిలవనుంది. ట్రైలర్‌లో సత్య టైమింగ్, ఆయన పేల్చిన పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. హీరోగా నటిస్తూనే ఈ చిత్రాన్ని నిర్మించిన రాకేష్ వర్రే.. ప్రేమలోని ఉత్సాహాన్ని, కవలల ట్విస్ట్ వల్ల వచ్చే అయోమయాన్ని తన నటనతో చక్కగా పండించారు.
మధుమిత సర్కార్ అటు ఆశా, ఇటు రూపా అనే రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో వైవిధ్యమైన నటనను కనబరిచారు. వీరితో పాటు అనుభవజ్ఞులైన నటి ఇంద్రజ, మైసూర్ సురేష్, ఇతర నటీనటులు కీలక పాత్రలలో మెరిశారు.
‘మాయా లేడీ’ ట్రైలర్ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉన్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం అండ్ పాటలు కథలోని ఎమోషన్‌కి, కామెడీకి సరైన న్యాయం చేశాయి. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించగా, వి.డి. జగన్ మోహన్ రావు సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ‘మాయ లేడీ’.. ఈ వినోదాత్మక ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. నవంబర్ 13న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక హాయిగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


