Korean Kanakaraju: మెగాస్టారే చీఫ్ గెస్ట్.. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. డేట్, టైమ్ ఇదే

Korean Kanakaraju Success Celebrations: కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Published on: Aug 10, 2026, 21:46:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Korean Kanakaraju Success Celebrations: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ థియేటర్లలో సరికొత్త మేజిక్ రిపీట్ చేస్తూ తన రీసెంట్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'తో క్లీన్ హిట్ కొట్టేశారు. బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్‌లోనే దంచికొట్టిన ఈ సినిమా.. డిస్ట్రిబ్యూటర్ల థియేట్రికల్ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని పూర్తిస్థాయిలో రికవరీ చేసి గ్రాండ్‌గా లాభాల బాట పట్టింది.

Korean Kanakaraju: మెగాస్టారే చీఫ్ గెస్ట్.. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. డేట్, టైమ్ ఇదే
Korean Kanakaraju: మెగాస్టారే చీఫ్ గెస్ట్.. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. డేట్, టైమ్ ఇదే

కొద్ది రోజులుగా మంచి మాస్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఖాతాలో ఈ మూవీ సాలిడ్ కంబ్యాక్‌గా నిలిచింది. దీంతో చిత్ర యూనిట్ ఈ ఘన విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయింది.

ఐటీసీ కోహినూర్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్.. చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్

ఈ భారీ సక్సెస్‌ను ఘనంగా జరుపుకోవడానికి మేకర్స్ రేపు (మంగళవారం, ఆగస్ట్ 11) హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీసీ కోహినూర్ (ITC Kohenur) హోటల్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ప్లాన్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని నేరుగా అభినందించనున్నారు.

పెద్దనాన్న చిరంజీవి చేతుల మీదుగా సక్సెస్ వేడుకలు జరగనుండటంతో మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మెగాస్టార్ రాకతో రాబోయే రోజుల్లో ఈ సినిమాకు పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్ పరంగా మరింత మైలేజ్ లభించి, థియేటర్లకు జనాలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

“నాన్ స్టాప్ ఎంటర్టైనర్ ను స్టైల్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి టైమ్ వచ్చేసింది. కొరియన్ కనకరాజు మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ రేపు ఆగస్ట్ 11న ఐటీసీ కోహినూర్ లో సాయంత్రం 4 గంటల నుంచి.. మెగాస్టార్ చిరంజీవి గారు గెస్ట్ ఆఫ్ హానర్ గా రానున్నారు” అనే క్యాప్షన్ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

మేర్లపాక గాంధీ మార్క్ హ్యూమర్.. సత్య కామెడీ నెక్ట్స్ లెవెల్

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన పంచులతో నవ్వులు పూయించిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఈసారి హారర్ కామెడీ జోనర్‌ను ఎంచుకుని ప్రేక్షకులను కట్టిపడేశారు. సీన్ సీన్‌కి ఆడియన్స్‌ను నవ్విస్తూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో స్క్రీన్ ప్లేని పరుగులు పెట్టించారు.

ముఖ్యంగా స్టార్ కమెడియన్ సత్య, మురళీధర్ గౌడ్ కాంబినేషన్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తోంది. హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ తన నటన, గ్లామర్‌తో ప్రశంసలు అందుకోగా.. శ్రీనివాస్ అవసరాల, మాస్టర్ రేవంత్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఈ కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్‌లో ఎస్ఎస్ తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. హారర్ సీన్స్‌లో భయపెడుతూనే, కామెడీ సన్నివేశాల్లో తన మార్క్ రీ-రికార్డింగ్‌తో థియేటర్లలో మంచి వైబ్ క్రియేట్ చేశారు.

టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా అత్యున్నత నిర్మాణ విలువల కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సరైన ప్రమోషన్ స్ట్రాటజీ, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోడుకావడంతో 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More