...
...
Next Story

మీరు వేసే విజిల్స్, కొట్టే చప్పట్లే నన్ను నడిపించే శక్తి.. రికార్డులు కాదు మీ ప్రేమే శాశ్వతం: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మన శంకరవరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతోపాటు అన్ని రికార్డులు తిరగరాయడంతో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ లో అతడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రికార్డులు కాదు మీ ప్రేమే శాశ్వతమంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్ చేశాడు.

Published on: Jan 20, 2026 04:25 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగాస్టార్ చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలుసు కదా. సంక్రాంతి సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 20) సాయంత్రం చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు.

మీరు లేనిదే నేను లేను

మీరు వేసే విజిల్స్, కొట్టే చప్పట్లే నన్ను నడిపించే శక్తి.. రికార్డులు కాదు మీ ప్రేమే శాశ్వతం: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మీరు వేసే విజిల్స్, కొట్టే చప్పట్లే నన్ను నడిపించే శక్తి.. రికార్డులు కాదు మీ ప్రేమే శాశ్వతం: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగు, ఇంగ్లిష్ లలో ఓ పోస్ట్ చేశాడు. “మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే - నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు" అని చిరు అన్నాడు.

మీ ప్రేమే శాశ్వతం

“ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం” అని చిరంజీవి అన్నాడు.

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి

"ఈ బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. మీ చిరంజీవి” అని మెగాస్టార్ రాసుకొచ్చాడు.

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe