Melbourne Mates Trailer: జెన్ జీ కపుల్.. జీరో చిల్.. ఆస్ట్రేలియాలో ఆగమాగం.. తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

Melbourne Mates Trailer: తెలుగులో మరో క్రేజీ జెన్ జీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది. మెల్‌బోర్న్ మేట్స్ పేరుతో ఈటీవీ విన్ ఓటీటీ ఈ సిరీస్ ను తీసుకురానుండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అదెలా ఉందో చూడండి.

Published on: Nov 24, 2026, 14:27:15 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Melbourne Mates Trailer: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త, వినూత్నమైన కథలను అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్ (ETV Win) నుంచి మరో యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. విదేశాల్లో ఉండే తెలుగు యువత జీవితాలు, ప్రేమ బంధాల నేపథ్యంలో రూపొందిన ‘మెల్‌బోర్న్ మేట్స్’ విన్ ఒరిజినల్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను మంగళవారం (నవంబర్ 24, 2026) టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శైలేష్ కొలను ('హిట్' ఫ్రాంచైజీ, 'సైంధవ్' ఫేమ్) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫ్రెష్ విజువల్స్, సహజమైన కామెడీ, ఎమోషన్స్‌తో యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Melbourne Mates Trailer: జెన్ జీ కపుల్.. జీరో చిల్.. ఆస్ట్రేలియాలో ఆగమాగం.. తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
Melbourne Mates Trailer: జెన్ జీ కపుల్.. జీరో చిల్.. ఆస్ట్రేలియాలో ఆగమాగం.. తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?

ట్రైలర్ ఎలా ఉంది? మెల్‌బోర్న్‌లో రెండు జంటల సందడి

ఆస్ట్రేలియాలోని అందమైన మెల్‌బోర్న్ నగరం నేపథ్యంలో సాగే ఈ కథలో నలుగురు యువతీయువకుల జీవితాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు

ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. రవి – అనిత, రాహుల్ – నిత్య అనే రెండు ప్రేమ జంటలు మెల్‌బోర్న్‌లో ఒకే ఇంటిని షేర్ చేసుకుంటూ నివసిస్తుంటాయి. జెన్ జీ కపుల్.. జీరో చిల్ అంటూ ట్రైలర్ మధ్యలో వచ్చే టెక్ట్స్ ఈ సిరీస్ ఎలా సాగబోతోందో చెబుతోంది.

విదేశాల్లో ఉద్యోగ వేట, ఆర్థిక సవాళ్లు, ఇంటి పనుల విషయంలో వచ్చే చిన్నచిన్న గొడవలు, అలాగే ఇద్దరు ప్రేమికుల మధ్య చోటుచేసుకునే ఊహించని ట్విస్టులు ట్రైలర్‌లో కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఒకే ఇంట్లో రెండు జంటలు కలిసి ఉన్నప్పుడు ఎదురయ్యే రోజువారీ గందరగోళాన్ని దర్శకుడు ఎంతో సహజంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను, చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ సిరీస్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మెల్‌బోర్న్ మేట్స్ నటీనటులు, సాంకేతిక వర్గం విశేషాలు

ఇప్పటికే డిజిటల్, వెండితెరపై తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. 'కలర్ ఫొటో', 'బలగం' సినిమాలతో మెప్పించిన దివ్య శ్రీపాద, కౌశిక్ ఘంటసాల, అభిజ్ఞ వూతలూరు, దరహాస్ మాతూరు, కమల్ కృష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. సతీష్ వర్మ అందించిన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్‌కు ఉదయ్ కుమార్ జి దర్శకత్వం వహించారు. నవీన్ పివ్హల్, రవి రాపోలు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యశ్వంత్ నాగ్ అందించిన ఆహ్లాదకరమైన సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఇప్పటికే విడుదలైన 'మెల్‌బోర్న్ మేట్స్' అఫీషియల్ గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలకు ఈటీవీ విన్ ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు శైలేష్ కొలను విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సిరీస్‌పై అంచనాలు మరింత పెరిగాయి.

విదేశాల్లో నివసించే ఎన్నారై యువతతో పాటు తెలుగు ప్రేక్షకులందరినీ అలరించే ఈ వెబ్ సిరీస్ నవంబర్ 30, 2026 నుంచి కేవలం ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.