Mirzapur The Movie: ఆ 35 సెకన్ల బోల్డ్ ఇంటిమేట్ సీన్ కట్.. బూతులు మ్యూట్.. మీర్జాపూర్ ద మూవీ సెన్సార్ పూర్తి

Mirzapur The Movie: బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైన 'మీర్జాపూర్: ద మూవీ'కి సెన్సార్ బోర్డు (CBFC) 'A' (అడల్ట్) సర్టిఫికేట్ మంజూరు చేసింది. సినిమాలో ఉన్న రెండు రొమాంటిక్ సన్నివేశాల నిడివిని 50 శాతం తగ్గిస్తూ 35 సెకన్ల దృశ్యాలను తొలగించారు. పలు బూతు పదాలు, కుల ప్రస్తావనను సవరించారు.

Published on: Aug 31, 2026, 19:22:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mirzapur The Movie: ఓటీటీ వేదికగా సంచలన విజయం సాధించిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఇప్పుడు వెండితెరపై ధమాకా సృష్టించేందుకు సిద్ధమైంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మీర్జాపూర్: ద మూవీ' (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Mirzapur The Movie: ఆ 35 సెకన్ల బోల్డ్ ఇంటిమేట్ సీన్ కట్.. బూతులు మ్యూట్.. మీర్జాపూర్ ద మూవీ సెన్సార్ పూర్తి
Mirzapur The Movie: ఆ 35 సెకన్ల బోల్డ్ ఇంటిమేట్ సీన్ కట్.. బూతులు మ్యూట్.. మీర్జాపూర్ ద మూవీ సెన్సార్ పూర్తి

అయితే విడుదలకు ముందే ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిశీలన పూర్తి చేసుకుని 'A' (Adults Only) సర్టిఫికెట్ పొందింది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కు పలు కీలక మార్పులు, చేర్పులు సూచించింది. మీర్జాపూర్ మార్క్ తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి కత్తెర వేయకపోవడం గమనార్హం.

35 సెకన్ల బోల్డ్ సీన్స్ అవుట్.. డైలాగ్స్‌పై కత్తెర

సెన్సార్ బోర్డు విడుదల చేసిన సర్టిఫికేషన్ నివేదిక ప్రకారం.. సినిమాలో ఉన్న రెండు అత్యంత సున్నితమైన, బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో 50 శాతం నిడివిని తగ్గించారు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో మరొకటి ఉన్న ఈ సన్నివేశాల నుంచి దాదాపు 35 సెకన్ల విజువల్స్, ఆడియోను తొలగించారు.

దీంతో పాటు సినిమాలో ఉపయోగించిన అసభ్యకర పదాలను నాలుగు చోట్ల మ్యూట్ చేయగా, మరో ఆరు చోట్ల బూతు పదాల స్థానంలో ప్రత్యామ్నాయ పదాలను ఉపయోగించాలని బోర్డు ఆదేశించింది. అలాగే ఒక సంభాషణలోని కుల ప్రస్తావనతో పాటు 'లాంత్' (Lanth - Idiot) అనే పదాన్ని కూడా సవరించారు.

హింసకు ఏ కట్స్ లేవు.. ఇదే అసలైన ట్విస్ట్

మీర్జాపూర్ వెబ్ సిరీస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రక్తం ఏరులై పారే తీవ్రమైన యాక్షన్, హింసాత్మకమైన సీన్లే. అయితే ఆశ్చర్యకరంగా సినిమాలో ఉన్న ఎలాంటి రక్తపాతం లేదా హింసాత్మక సన్నివేశాలపై సెన్సార్ బోర్డ్ కత్తెర వేయకపోవడం గమనార్హం.

మార్పులన్నీ కేవలం బోల్డ్ సీన్స్, భాష, కొన్ని సున్నితమైన పదాలకే పరిమితమయ్యాయి. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వ్యతిరేక హెచ్చరికల కార్డ్‌లను యథావిధిగా ప్రదర్శించాలని బోర్డు ఆదేశించింది.

రన్ టైమ్ 3 గంటల పైనే.. కాలీన్ భయ్యా, గుడ్డూ పండిట్ రీ-ఎంట్రీ

ఈ సినిమాలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేందు శర్మ తిరిగి తమ ఐకానిక్ పాత్రల్లో అలరించనున్నారు. శ్వేతా త్రిపాఠి, రసికా దుగల్, రవికిషన్, జితేంద్ర కుమార్, శ్రియ పిల్‌గావ్‌కర్ వంటి భారీ తారాగణం ఇందులో నటిస్తోంది. పునీత్ కృష్ణ ఈ చిత్రానికి కథ అందించారు.

సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల తర్వాత ఈ సినిమా తుది రన్ టైమ్ 197 నిమిషాల 19 సెకన్లు (దాదాపు 3 గంటల 17 నిమిషాలు)గా ఖరారైంది. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రివైజింగ్ కమిటీ ఆమోదంతో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రైమ్ వీడియోలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే మూడు సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్ ను సినిమాగా ఎలా తీశారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More