Mirzapur The Movie: మహారాణా ప్రతాప్ పాటతో రౌడీల ఫైటా.. మీర్జాపూర్ మేకర్స్‌కు క్లాస్ పీకిన ఢిల్లీ హైకోర్టు
Mirzapur The Movie: మీర్జాపూర్ ద మూవీపై వివాదం రేగింది. ఈ సినిమా క్లైమ్యాక్స్ సీన్ పై పిటిషన్ దాఖలు కాగా.. ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది? ఆ వివాదం ఏంటో చూడండి.
Mirzapur The Movie: భారతీయ వీరయోధుడు మహారాణా ప్రతాప్ ఘనతను అవమానించేలా క్లైమాక్స్ గ్యాంగ్‌స్టర్ ఫైట్‌లో ఆయన పాటను వాడారంటూ 'మీర్జాపూర్: ది మూవీ' పై దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. వివాదాస్పద పాటను మార్చేందుకు నిర్మాతలు ముందుకు రావడంతో ఈ గొడవకు త్వరలోనే శుభం కార్డు పడే అవకాశం కనిపిస్తోంది.

పిటిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ వేసిన పిల్ (PIL) విచారణ సందర్భంగా సీబీఎఫ్‌సీ (CBFC)కి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నిర్మాతలు కోరిన మార్పులపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
క్లైమాక్స్ సీన్‌లో 'శూర్వీర్' పాట తీసివేత
మహారాణా ప్రతాప్ త్యాగానికి, శౌర్యానికి ప్రతీకగా రూపొందించిన 'శూర్వీర్' పాటను సినిమాలోని గ్యాంగ్‌స్టర్ ఫైట్ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వాడటంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరస్థులతో దేశభక్తుడిని పోల్చడం భారతీయుల సాంస్కృతిక సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వివాదం పెరగడంతో మేకర్స్ దిగొచ్చారు. క్లైమాక్స్ సీన్ నుంచి ఆ పాటను తొలగించి దానికి బదులుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) మాత్రమే ఉపయోగిస్తామని, ఇందుకోసం సెన్సార్ బోర్డుకు అప్లై చేశామని ప్రొడక్షన్ హౌస్ లాయర్ కోర్టుకు వెల్లడించారు.
"హింసను పూజించే స్థాయికి దిగజారామా?".. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఈ కేసు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో గ్యాంగ్‌స్టర్ కల్చర్‌కు దేశభక్తి పాటలు జోడించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.
"మనం సమాజంలో హింసను పూజించే స్థాయికి దిగజారామా? ఇది మంచి పద్ధతి అనిపించుకోదు" అని ధర్మాసనం నోటిమాటగా వ్యాఖ్యానించింది. ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ పేరిట చారిత్రక వీరుల ఇమేజ్‌ను దెబ్బతీయకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.
ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్‌లో బిగ్ ట్విస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో భారీ హిట్ సాధించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ క్రేజ్‌తో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు భయ్యా), దివ్యేందు (మున్నా భయ్యా) ప్రధాన పాత్రల్లో ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు.
మరో నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండటంతో అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ కోరారు. సెన్సార్ బోర్డు తుది నిర్ణయం ఆధారంగా తదుపరి విచారణను హైకోర్టు మరో వారానికి వాయిదా వేసింది.
మరోవైపు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మైలురాయిని దాటేయడం విశేషం. దీంతో సినిమాకు సీక్వెల్ తీసుకురావడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


