Mirzapur: మున్నా భయ్యాను చంపడం చాలా పెద్ద తప్పు.. థియేటర్లలో రీఎంట్రీ ఇస్తుండటంపై దివ్యేందు షాకింగ్ కామెంట్స్

Mirzapur: మీర్జాపూర్ ద మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మున్నా భయ్యా దివ్యేందు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ వెబ్ సిరీస్ లో మున్నా భయ్యా పాత్రకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Published on: Aug 12, 2026, 14:15:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mirzapur: ఓటీటీ వరల్డ్ లో సంచలనం సృష్టించిన పాపులర్ క్రైమ్ డ్రామా 'మీర్జాపూర్' ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రచ్చ చేయడానికి సిద్ధమైంది. ముంబైలో గ్రాండ్‌గా జరిగిన 'మీర్జాపూర్: ది మూవీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన విషయం మున్నా భయ్యా కంబ్యాక్.

Mirzapur: మున్నా భయ్యాను చంపడం చాలా పెద్ద తప్పు.. థియేటర్లలో రీఎంట్రీపై దివ్యేందు షాకింగ్ కామెంట్స్
Mirzapur: మున్నా భయ్యాను చంపడం చాలా పెద్ద తప్పు.. థియేటర్లలో రీఎంట్రీపై దివ్యేందు షాకింగ్ కామెంట్స్

మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 2 చివర్లో గుడ్డూ పండిట్, గోలూ గుప్తాల చేతిలో దారుణంగా దెబ్బతిని చనిపోయిన మున్నా భయ్యా పాత్ర మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ప్రత్యక్షం కావడం ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

నన్ను చంపడం మేకర్స్ చేసిన పెద్ద మిస్టేక్: దివ్యేందు

ట్రైలర్ లాంచ్‌లో తన క్యారెక్టర్ రీఎంట్రీ గురించి నటుడు దివ్యేందు తన మార్క్ మున్నా భయ్యా శైలిలో స్పందించారు. "అసలు మున్నా భయ్యాను చంపేయడమే మేకర్స్ చేసిన అతిపెద్ద తప్పు, ఈ విషయంలో అందరూ ఏకీభవిస్తారు" అని సరదాగా కామెంట్ చేశారు.

"నేను పక్కా హిందీ సినిమా హీరోని, నాకు చావు లేదు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు" అంటూ తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఆటిట్యూడ్‌తో ఈవెంట్‌లో విపరీతమైన జోష్ నింపారు.

సీజన్ 2లో అసలు ఏం జరిగింది?

మీర్జాపూర్ సీజన్ 2 క్లైమాక్స్‌లో గుడ్డూ పండిట్, గోలూ గుప్తా కలసి మున్నా త్రిపాఠిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గోలూ పదే పదే షూట్ చేయడంతో మున్నా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని గుడ్డూ, గోలూ అక్కడ నుంచి తీసుకుపోతారు.

అయితే ఓటీటీ హిస్టరీలోనే మోస్ట్ లవ్డ్ విలన్ లేదా యాంటీ హీరోగా నిలిచిన మున్నా భయ్యా పాత్రను థియేట్రికల్ మూవీలో మళ్లీ ఎలా తీసుకువచ్చారనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచేసింది.

ఫ్యాన్స్ డిమాండ్ వల్లే థియేటర్లలోకి మీర్జాపూర్

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఫర్హాన్‌ అక్తర్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల విపరీతమైన ప్రేమే తమను ఈ ప్రాజెక్ట్ థియేటర్లకు తీసుకువచ్చేలా చేసిందని వెల్లడించారు. "అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ షో ప్రపంచమంతటా విస్తరించింది, మేము ఎక్కడికి వెళ్లినా మీర్జాపూర్ నెక్స్ట్ అప్‌డేట్ ఏంటని జనాలు అడిగేవారు" అని తెలిపారు.

రచయిత పునీత్ కృష్ణ మొదటిసారి ఈ కథ లైన్ చెప్పినప్పుడు తమ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ సరదా కామెంట్స్ చేశారు. "పునీత్ కథ చెప్పినప్పుడు ముందుగా అతడిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలనిపించింది, కానీ ఈ కథను షోగా తీస్తే జనాలు పిచ్చెక్కిపోతారని గ్రౌండ్ రియాలిటీ అర్థమైంది" అని నవ్వుతూ చెప్పారు.

మీర్జాపూర్ ద మూవీ సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్

ఈ బిగ్ స్క్రీన్ క్రైమ్ డ్రామాలో కాలిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, బీనా త్రిపాఠిగా రసికా దుగల్ మళ్లీ మెరవనున్నారు. ఒరిజినల్ సిరీస్‌లో విక్రాంత్ మాస్సే పోషించిన బాబ్లూ పండిట్ పాత్రలో ఈసారి ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్ అలరించబోతున్నారు.

వీరితో పాటు హర్షితా గౌర్, షీబా చద్దా, అభిషేక్ బెనర్జీ, రాజేష్ తైలాంగ్ పాత పాత్రల్లోనే కనిపిస్తుండగా.. సోనాల్ చౌహాన్, రవికిషన్, సుశాంత్ సింగ్, మోహిత్ మాలిక్ కొత్తగా టీమ్‌లో చేరారు. భారీ అంచనాల మధ్య 'మీర్జాపూర్: ది మూవీ' సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More