OTT: థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
OTT: ఓటీటీలోకి ఓ సెన్సేషనల్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ గఫూర్ నటించిన ఈ సినిమా.. థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
OTT: మలయాళ సినిమా ఇండస్ట్రీలోని అంతర్గత రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో రీసెంట్‌గా థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్' (Mollywood Times). ఈ సినిమా అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను అధికారికంగా అనౌన్స్ చేసింది.

థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. జులై 3 నుంచి డిజిటల్ వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఐఎండీబీలో 7.5 రేటింగ్ సాధించిన సినిమా ఇది.
ప్రేమలు నస్లేన్ వన్ మ్యాన్ షో
ఈ సినిమాకు 'మలయాళ సినిమాపై ఒక లవ్ హేట్ లెటర్' అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా సెన్సార్ బోర్డ్ (CBFC) నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సీన్లు కట్ చేయకుండా థియేటర్లలో ప్రదర్శించారంటూ ఈ మూవీ మేకర్స్‌పై లీగల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ జియోహాట్‌స్టార్ ఈ క్రేజీ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేసింది.
గతంలో 'ముకుందన్ ఉన్ని అసోసియేట్స్' లాంటి కల్ట్ సైకలాజికల్ డార్క్ కామెడీతో సౌత్ ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అభినవ్ సుందర్ నాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన సృష్టించిన 'సక్సెస్ ట్రైలజీ' లో ఇదొక సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రాజెక్ట్ కావడం విశేషం.
'ప్రేమలు' సినిమాతో పాన్-ఇండియా రేంజ్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ సెన్సేషన్ నస్లేన్ గఫూర్ (Naslen) ఇందులో వినీత్ మాధవన్ అనే ఒక కాబోయే డైరెక్టర్ క్యారెక్టర్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన డెబ్యూ సినిమా హిస్టరీలో నిలిచిపోయేలా ఉండాలని కలలు కనే ఒక యంగ్ ఫిల్మ్ మేకర్.. ఇండస్ట్రీలో ఉండే గేట్‌కీపర్స్, పాలిటిక్స్, ఈగోల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడనేది ఈ సినిమా అసలు కథ.
హాలీవుడ్ రేంజ్ రివ్యూస్.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్
ఈ మాలీవుడ్ టైమ్స్ సినిమా కథ ఫేమస్ నవల 'ఫౌంటెన్‌హెడ్' స్పూర్తితో రాశారు. ఒక క్రియేటివ్ వ్యక్తి తన ఒరిజినాలిటీని కాపాడుకోవడానికి, కమర్షియల్ ఇండస్ట్రీతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో డైరెక్టర్ చాలా సహజంగా చూపించారు.
"మాలీవుడ్ టైమ్స్ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాలను చాలా బోల్డ్‌గా ఎండగట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీతో సాగితే.. సెకండ్ హాఫ్ లో కథ చాలా సీరియస్ గా, ఇంటెన్స్ గా మారుతుంది" అని ప్రముఖ మీడియా హౌస్ 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' తన రివ్యూలో పేర్కొంది.
ఈ సినిమాలో నస్లేన్ తో పాటు షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్, సంగీత్ ప్రతాప్, జగదీష్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విశ్వజిత్ ఓడుక్కత్తిల్ సినిమాటోగ్రఫీ ఈ డార్క్ కామెడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఆశిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హై బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


