Mrithyunjay OTT: ఆ హత్యల వెనుక మిస్టరీ ఏంటీ? ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీవిష్ణు క్రైమ్ థ్రిల్లర్

Mrithyunjay OTT: ఓటీటీలోకి మరో కొత్త తెలుగు సినిమా రాబోతుంది. హత్యల వెనుక మిస్టరీ ఛేదించే హీరో కథతో తెరకెక్కిన శ్రీవిష్ణు మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

Published on: Mar 29, 2026, 13:56:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజ‌య్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే హీరోగా ఈ సినిమాలో శ్రీ విష్ణు నటించాడు.

ఓటీటీలోకి శ్రీవిష్ణు సినిమా (x)
ఓటీటీలోకి శ్రీవిష్ణు సినిమా (x)

మృత్యుంజ‌య్ ఓటీటీ

శ్రీ విష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజ‌య్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 3 నుంచి మృత్యుంజ‌య్ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.

థియేటర్ రిలీజ్

మృత్యుంజ‌య్ సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ మృత్యుంజ‌య్ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వినిపించింది.

మృత్యుంజ‌య్ స్టోరీ

హత్యల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడమే కథగా సాగే సినిమానే మృత్యుంజ‌య్. ఇందులో జయ్ (శ్రీవిష్ణు) ఓ పేపర్ యాడ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటాడు. కానీ అతనికి ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కల. అవకాశం రాకపోవడంతో ఇష్టం లేకపోయినా యాడ్ విభాగంలోనే కొనసాగుతాడు.

ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ప్రకటనలు సంపాదిస్తుంటాడు. చనిపోయిన వాళ్ల గురించి గొప్పగా చెప్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ సారి అచ్యుత్ రావు (బాలాదిత్య) మరణిస్తాడు. వాళ్ల ఇంటికి జయ్ వెళ్తాడు.

పాప ఏడుపుతో

అచ్యుత్ రావుకు చిన్న కూతురు అంజలి ఉంటుంది. నాన్నకు ఎందుకు అలా జరిగిందని జయ్ ను ఆ పాప అడుగుతుంది. తాను తెలుసుకుంటానని జయ్ చెప్తాడు. అయితే అచ్యుత్ లాగే మరో వ్యక్తి కూడా మరణిస్తాడు. దీంతో ఈ చావుల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జయ్ రంగంలోకి దిగుతాడు.

హత్యలు

మరోవైపు ఐపీఎస్ ఆఫీసర్ సీతా పరశురాం (రెబా మోనికా) కూడా ఈ చావులపై విచారణ కొనసాగిస్తుంది. కానీ పై అధికారుల ఒత్తిడి కారణంగా అవి ప్రమాదాలే అని నమ్ముతుంది. కానీ అవి సాధారణ మరణాలు కాదని హత్యలు అని జయ్ తెలుసుకుంటాడు. మరి ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వాళ్లను జయ్ కనిపెట్టాడా? అన్నది మృత్యుంజ‌య్ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More