...
...
Next Story

Mysaa Teaser: ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు..ఆ ఆయుధమే మైసా..అదిరిపోయిన మైసా టీజర్..రష్మిక మందన్న నట విశ్వరూపం..గూస్ బంప్స్!

Mysaa Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అప్ కమింగ్ మూవీ ‘మైసా’ టీజర్ రిలీజైంది. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచేలా, గూస్ బంప్స్ తెప్పించేలా ఈ టీజర్ లోని సీన్స్ ఉన్నాయి. ఈ మూవీలో రష్మిక నట విశ్వరూపం చూపించిందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Published on: Sep 20, 2026, 20:24:17 IST
Advertisement

Mysaa Teaser: పక్కింటి అమ్మాయి క్యారెక్టర్, గ్లామర్ లేడీ.. రష్మిక మందన్న అంటే ఇన్ని రోజులూ ఇవే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి తనో పర్ఫార్మర్ అని చాటేందుకు ‘మైసా’ మూవీ వచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఇవాళ (సెప్టెంబర్ 20) రిలీజైన రష్మిక మందన్న ‘మైసా’ టీజర్ ఆ రేంజ్ లో ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

మైసా టీజర్

ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు..ఆ ఆయుధమే మైసా..అదిరిపోయిన మైసా టీజర్..రష్మిక మందన్న నట విశ్వరూపం..గూస్ బంప్స్!
ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు..ఆ ఆయుధమే మైసా..అదిరిపోయిన మైసా టీజర్..రష్మిక మందన్న నట విశ్వరూపం..గూస్ బంప్స్!

రష్మిక మందన్న ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. రష్మిక మందన్న లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘మైసా’ మూవీ టీజర్ ఆదివారం సాయంత్రం రిలీజైంది. ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో రష్మిక మందన్న యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ లో ఉన్నాయి.

టీజర్ రివ్యూ

మైసా టీజర్ మామూలుగా లేదు. మైసా మూవీ ఓ తెగకు చెందిన అమ్మాయి పోరాటంగా, తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎంతకైనా తెగించే యువతి యుద్ధంగా కనిపిస్తోంది. అందరినీ ఎదిరించి పోరాడే ‘మైసా’గా రష్మిక మందన్న నటిస్తోంది. పోలీసులు కూడా ఆమెను అరెస్టు చేస్తారు. శత్రువులు ఆమెను చంపాలని వెంటబడతారు.

కానీ చేతికి బేడిలతోనే మైసా క్యారెక్టర్లో రష్మిక మందన్న చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఇక ఈ సినిమా కోసం రష్మిక మందన్న షూట్ చేసిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ గ్లింప్స్ కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.

వేరే లెవల్

ఎమోషన్ సీన్స్ లో గుండె పిండేసిన రష్మిక మందన్న.. ఫైటింగ్ సీక్వెన్స్ లో రెచ్చిపోయింది. విలన్లను విరగ్గొట్టేసింది. ఈ మూవీ కోసం రష్మిక మందన్న పడ్డ కష్టం ఈ టీజర్ లో క్లియర్ గా కనిపించింది.

‘‘యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ, ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు. యుద్ధాన్ని డిసైడ్ చేసే ఆయుధం ఆమె’’ అంటూ మైసా గురించి పోలీస్ క్యారెక్టర్లో ఉన్న రావు రమేష్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

మైసా రిలీజ్ డేట్

రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్న మైసా మూవీ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 27, 2026న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవల్లో అయిదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవీంద్ర పుల్లె డైరెక్టర్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks