Telugu Horror Thriller: టాలీవుడ్‌లో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం', 'పుష్ప' వంటి భారీ యాక్షన్, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఇప్పుడు రూట్ మార్చింది. తమ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తొలిసారిగా ఒక విభిన్నమైన హారర్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆ చిత్రమే '418'.

విలక్షణమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సమర్పకుడిగా (Presenter) వ్యవహరిస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా కేవలం డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో మాత్రమే ఈ మూవీ ప్రీమియర్లు ప్రదర్శించనుండటం విశేషం.
అక్టోబర్ 22న పెయిడ్ ప్రీమియర్స్.. అయితే ఒక కండిషన్
ఈ 418 సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23, 2026న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఆడియన్స్‌లో ఉన్న బజ్ దృష్ట్యా గ్రాండ్ రిలీజ్‌కు ఒక రోజు ముందే.. అంటే అక్టోబర్ 22వ తేదీ రాత్రి 10:48 గంటలకు ప్రత్యేక పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కానీ ఈ ప్రీమియర్లకు మేకర్స్ ఒక ప్రత్యేకమైన కండిషన్ విధించారు. ప్రేక్షకులు హారర్ అనుభూతిని పరిపూర్ణంగా ఆస్వాదించాలనే ఉద్దేశంతో కేవలం డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్ సిస్టమ్ కలిగిన థియేటర్లలో మాత్రమే ఈ పెయిడ్ ప్రీమియర్లను వేయనున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని దీనిని బట్టి అర్థమవుతోంది. ఈ ప్రీమియర్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారం (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి.
టీజర్, ట్రైలర్‌తో పెరిగిన హైప్
ఇటీవల విడుదలైన ఈ 418 సినిమా రిలీజ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. విజువల్స్, విపరీతమైన భయాన్ని కలిగించే సౌండ్ డిజైన్, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఈ చిత్రాన్ని హారర్ లవర్స్‌కు ఒక విందుగా మార్చబోతున్నాయని ప్రచారం సాగుతోంది. కీర్తన్ నాడగౌడ (Kirtan Nadagouda) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
418 మూవీ కాస్ట్, పాన్ ఇండియా రిలీజ్
{{/usCountry}}ఇటీవల విడుదలైన ఈ 418 సినిమా రిలీజ్ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. విజువల్స్, విపరీతమైన భయాన్ని కలిగించే సౌండ్ డిజైన్, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే ఈ చిత్రాన్ని హారర్ లవర్స్‌కు ఒక విందుగా మార్చబోతున్నాయని ప్రచారం సాగుతోంది. కీర్తన్ నాడగౌడ (Kirtan Nadagouda) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
418 మూవీ కాస్ట్, పాన్ ఇండియా రిలీజ్
{{/usCountry}}'418' చిత్రంలో చైత్ర జె ఆచార్ (Chaitra J Achar) కథానాయికగా ప్రధాన పాత్ర పోషించగా.. సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్, రమేష్ ఇందిర ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అక్టోబర్ 23న ఏకకాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న ఈ తొలి హారర్ ప్రయోగం ఏమేరకు సంచలనం సృష్టిస్తుందో చూడాలి.