418 Trailer: ఆ 418 గదిలో ఏం జరిగింది? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్, మైత్రీ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్

418 Trailer: తెలుగులో మరో హారర్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాబోతోంది. 418 ద మూవీ అనే ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కింది. తాజాగా రిలీజైన ట్రైలర్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Published on: Sep 11, 2026, 19:00:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

418 Trailer: 'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి ఊహించని హారర్ షాక్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఆయన సమర్పిస్తున్న లేటెస్ట్ ఆర్గానిక్ హారర్ థ్రిల్లర్ '418 ది మూవీ' ట్రైలర్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 15 ఏళ్లుగా మూతపడిన ఒక బిల్డింగ్ వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ చుట్టూ ఈ సినిమా సాగనుంది.

418 Trailer: ఆ 418 గదిలో ఏం జరిగింది? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్, మైత్రీ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్
418 Trailer: ఆ 418 గదిలో ఏం జరిగింది? వెన్నులో వణుకు పుట్టిస్తున్న ప్రశాంత్ నీల్, మైత్రీ హారర్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్

రూమ్ నంబర్ 418 సీక్రెట్.. మూడున్నర నిమిషాల వణుకు పుట్టించే ట్రైలర్

నయా దర్శకుడు కీర్తన్ నాడగౌడ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, చైత్ర జె ఆచార్, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన 418 మూవీ ట్రైలర్ ఆరంభం నుంచే తీవ్రమైన భయాందోళనలకు గురిచేసేలా విజువల్స్ డిజైన్ చేశారు.

15 సంవత్సరాలుగా పాడుబడిపోయిన ఒక కట్టడాన్ని రీ-ఓపెన్ చేయడంతో అక్కడికి అనూహ్యమైన దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఆ బిల్డింగ్‌లోని 'రూమ్ నంబర్ 418' లో జరిగే అతీత శక్తుల కదలికలు ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ప్రశాంత్ నీల్ మార్క్ కట్.. గర్భవతులకు మేకర్స్ వార్నింగ్

ట్రైలర్ ఎడిటింగ్ చేసిన తీరు చూస్తే ప్రశాంత్ నీల్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. చివరి ఒక నిమిషంలో చూపించిన విజువల్స్, విచిత్రమైన సౌండ్ డిజైన్ హారర్ లవర్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. "దెయ్యాల కంటే మనుషుల ఊహే చాలా ప్రమాదకరమైనది" అంటూ ట్రైలర్‌లో చెప్పే డైలాగ్ సినిమా కాన్సెప్ట్ ఏంటో సాంకేతికంగా తెలియజేస్తోంది.

భయంకరమైన సీన్లు, రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను చూడటానికి ముందు మేకర్స్ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా జారీ చేశారు. గర్భవతులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉండాలని సూచించడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ అరుదైన ప్రయోగం

టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సాధారణంగా బిగ్ స్టార్స్ తో మాస్ కమర్షియల్ సినిమాలు తీస్తుంటుంది. అయితే ప్రశాంత్ నీల్ తో కలిసి ఇలాంటి డిఫరెంట్ ఆర్గానిక్ హారర్ కాన్సెప్ట్ ఉన్న సినిమాను ప్రమోట్ చేయడం విశేషం. పక్కా కన్నడ, తెలుగు నేటివిటీ నటులతో తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ లో సప్త సాగరాలు దాటి ఫేమ్ చైత్ర జె ఆచార్ నటన హైలైట్ కానుందని తెలుస్తోంది.

ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ పొందిన '418 ది మూవీ' థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నిజమైన హారర్ మూవీ అనుభవాన్ని కోరుకునే ఆడియన్స్‌కు ఈ చిత్రం ఖచ్చితంగా ఒక కొత్త రకమైన థ్రిల్ ఇస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More