Rahul Sipligunj: ఆ లాయర్ వల్లే ఇదంతా.. నా భార్యకు అతనితో ఈగో క్లాషెస్: పోలీస్ కేసుపై రాహుల్ సిప్లిగంజ్ వివరణ
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనపై నమోదైన పోలీసు కేసుపై స్పందించారు. అసలు ఈ కేసు ఎలా వచ్చిందో వివరిస్తూ.. బాధితురాలి లాయర్ వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు.
Rahul Sipligunj: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు' ఫేమ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ ప్రస్తుతం ఓ తీవ్ర వివాదం చుట్టుముట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై రాహుల్ స్పందిస్తూ అసలు నిజాలు బయటపెట్టారు.

బంబుల్ యాప్ పరిచయం.. ఈగో క్లాష్‌తో మొదలైన లీగల్ వార్
విశాఖపట్నం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్పురపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి బంబుల్ (Bumble) డేటింగ్ యాప్ ద్వారా సదరు బాధితురాలికి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని, ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చి విడిపోవడానికి సిద్ధపడ్డారని సమాచారం.
ఈ క్రమంలోనే రాహుల్ రెడ్డి బంధువులైన రాహుల్ సిప్లిగంజ్, ఆయన భార్య హరిణ్య రెడ్డితో పాటు మరికొందరు తమను బెదిరించారని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసులో ఏ1 గా రాహుల్ రెడ్డి పేరు ఉండగా, మొత్తం 16 మందిపై రకరకాల సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
'లాయర్ లీక్ చేశారు.. ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అయిపోయింది'
బియాండ్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడూ ఈ వ్యవహారంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. "రాహుల్ రెడ్డి మా భార్య హరిణ్య బంధువు. వాళ్లిద్దరి మధ్య పర్సనల్ ఈగో క్లాషెస్ వల్ల ఈ సమస్య మొదలైంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే వాళ్లిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. జులై నెలకు సంబంధించిన ఒక వీడియో కూడా నా దగ్గర ఉంది" అని రాహుల్ తెలిపారు.
బాధితురాలు మొదట ఆశ్రయించిన లాయర్ వల్లే ఈ కేసులో తన పేరు చేరిందని రాహుల్ ఆరోపించారు. "ఆ లాయరే విషయాన్ని పెద్దది చేసి అందరి పేర్లు చేర్పించారు. ఇప్పుడు ఇద్దరూ కాంప్రమైజ్ అయినా సరే, ఆ లాయరే ఈ ఎఫ్ఐఆర్ వార్తలను బయటకు లీక్ చేశారు. నేను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నా" అని రాహుల్ స్పష్టం చేశారు.
ఏసీపీ స్టేట్‌మెంట్.. ఏ16గా రాహుల్
పోలీసుల వెర్షన్ ప్రకారం జూన్ 12న సదరు మహిళ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలిని బెదిరించి కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి తెచ్చినందుకు గాను రాహుల్ సిప్లిగంజ్, ఆయన భార్య హరిణ్య రెడ్డిల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు ఏసీపీ అంబేడ్కర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి 16 మందిపై లోతైన విచారణ కొనసాగుతోంది. అయితే తాను కేవలం బాధితురాలికి, చట్టానికి మాత్రమే సమాధానం చెప్తానని, ఏ తప్పూ చేయలేదని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ విన్నర్ నుంచి ఆస్కార్ స్టేజ్ వరకు.. రాహుల్ కెరీర్
రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో కెరీర్ ప్రారంభించి టాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా ఎదిగారు. 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' విజేతగా నిలిచి తెలుగు ఇళ్లలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాలోని 'నాటు నాటు' పాటకుగానూ కాల భైరవతో కలిసి ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రపంచస్థాయి గుర్తింపు సాధించారు. ప్రస్తుతం పలు సినిమాల్లో పాటలు పాడుతూనే, ప్రైవేట్ ఆల్బమ్స్, నటన వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఈ లీగల్ ఇష్యూ నుంచి ఆయన త్వరలోనే క్లీన్ చిట్‌తో బయటపడతారని అభిమానులు ఆశిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


