Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్‌లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్

Nag Ashwin: కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజులే పూర్తయిందని, ప్రభాస్ ఫ్రీ అయిన తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని వెల్లడించారు.

Published on: Sep 1, 2026, 19:47:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nag Ashwin: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సీక్వెల్ 'కల్కి 2' కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పురోగతిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్‌లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్
Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్‌లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్

సుమ ప్రశ్నకు నాగ్ అశ్విన్ మార్క్ సమాధానం

హైదరాబాద్‌లో జరిగిన దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నాగ్ అశ్విన్‌ను యాంకర్ సుమ 'కల్కి 2' గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. గతంలో మీరు కల్కి సీక్వెల్ తీయాలంటే గ్రహాలన్నీ ఒకే వరసలోకి రావాలని చెప్పారు కదా.. మరి ఇప్పుడు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు.

దీనికి నాగ్ అశ్విన్ తనదైన శైలిలో స్పందిస్తూ, "ఆ గ్రహాలన్నీ అలైన్ అయిపోయి ఒక రౌండ్ కూడా తిరిగేశాయి. ఇప్పుడు మళ్లీ ఇంకొక రౌండ్ తిరిగి సరిగ్గా అలైన్ అయినప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాం" అని సరదాగా సమాధానమిచ్చారు.

ఇప్పటివరకు కేవలం 10 రోజులే షూటింగ్

'కల్కి 2' షూటింగ్ పురోగతి గురించి చెబుతూ.. ఇప్పటివరకు తాము కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని నాగ్ అశ్విన్ వెల్లడించారు. "ప్రభాస్ గారు పూర్తిగా ఫ్రీ అయ్యాక, ఆయన డేట్స్ దొరగ్గానే ఒకే సుదీర్ఘ షెడ్యూల్‌లో మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం" అని స్పష్టం చేశారు.

దీంతో ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల వర్క్ పూర్తి చేసిన వెంటనే కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరగనుందని స్పష్టమవుతోంది.

అమితాబ్-కమల్ హాసన్ కాంబో సీన్స్ షూట్ పూర్తి

మరోవైపు ఈ సీక్వెల్ కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్‌పై కొన్ని కీలకమైన సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ కాంబినేషన్ మొదటి భాగంలో నేరుగా ఎదురుపడలేదు.

కానీ ఈ సీక్వెల్‌లో వారిద్దరి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. ఫిబ్రవరిలోనే వీరిద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు సెట్స్‌లో పాల్గొని వర్క్ చేశారని అమితాబ్ స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ వెల్లడించారు.

ప్రభాస్ చేతిలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ పలు భారీ చిత్రాలలో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauzi) షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కూడా లైన్‌లో ఉంది. విష్ణు మంచు ‘కన్నప్ప’లో కామియో చేయడంతో పాటు తేజ సజ్జా ‘మిరాయ్’కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించారు.

క్యాస్టింగ్‌లో మార్పులు? సాయి పల్లవి, ఆలియా భట్?

కల్కి మొదటి భాగంలో సుమతిగా నటించిన దీపికా పదుకోన్ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఒక పవర్ ఫుల్ రోల్ కోసం సంప్రదింపుల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ తన లైనప్‌లోని సినిమాలను పూర్తి చేసి డేట్స్ కేటాయించగానే 'కల్కి 2' విజువల్ వండర్ పట్టాలెక్కనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More