...
...
Next Story

Naga Chaitanya: ఏఐతో అశ్లీల కంటెంట్.. అనుమతి లేకుండా పేరు వాడటంపై నాగ చైతన్య ఫైర్.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు

Naga Chaitanya: తన వ్యక్తిగత హక్కులకు (Personality Rights) రక్షణ కల్పించాలని కోరుతూ టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరుతో ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించడంతో పాటు తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Published on: May 29, 2026, 22:14:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాడుకోవడం, ఏఐ (AI) సాయంతో అశ్లీల కంటెంట్ సృష్టించడం, నకిలీ వస్తువుల అమ్మకాలపై ఆయన న్యాయస్థానంలో దావా వేశారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను చైతన్య తన పిటిషన్‌లో తీవ్రంగా తప్పుబట్టారు.

అశ్లీల కంటెంట్, ట్రోల్స్‌పై న్యాయపోరాటం

అనుమతి లేకుండా పేరు వాడటంపై నాగ చైతన్య ఫైర్ (AFP)
అనుమతి లేకుండా పేరు వాడటంపై నాగ చైతన్య ఫైర్ (AFP)

నాగ చైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ కక్కర్ జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. వెబ్‌సైట్లకు ట్రాఫిక్ పెంచుకోవడం కోసం కొందరు చైతన్య పేరుతో పాటు అసభ్యకరమైన పదాలను వాడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ డీప్‌ఫేక్ వీడియోల ద్వారా అభ్యంతరకరమైన స్థితిలో చైతన్య ఉన్నట్లుగా తప్పుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.

వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం

చైతన్య ఫోటోలతో అనధికారికంగా మర్చండైజ్ (వస్తువులు) అమ్ముతున్న వెబ్‌సైట్ల జాబితాను కూడా హైకోర్టుకు సమర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామి నటుడిగా ఉన్న చైతన్య పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఏఐ టూల్స్, డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్‌లను వాడుకుంటూ కమర్షియల్ గా లబ్ది పొందుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనివల్ల ఆయన వ్యక్తిగత గోప్యత, గౌరవం, పబ్లిక్ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాదించారు. ఈ సందర్భంగా చైతన్య తండ్రి నాగార్జున వ్యక్తిగత హక్కులను కాపాడుతూ గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును కూడా న్యాయవాది గుర్తుచేశారు.

కోర్టు స్పందన - తదుపరి విచారణ

వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. "పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు సాధారణ ప్రజల కంటే ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

తన పేరు, ప్రతిష్టలను దెబ్బతీసేలా ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, తన పేరుతో వ్యాపారం చేయడం, నిరాధారమైన ఆరోపణలతో ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

చైతన్య తరఫున కోర్టులో వాదనలు వినిపించిన లాయర్ ఎవరు?

చైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ కక్కర్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఈ కేసులో తదుపరి విచారణ ఎప్పుడు జరగనుంది?

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe