Nana Patekar: గురువారం (అక్టోబర్ 8) ఉదయాన్నే గోవాలోని తన నివాసంలో ఉన్న నానా పటేకర్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే ఆయన తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని తెలపగా, ఆయన్ను స్థానిక మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని వైద్యుల బృందం దాదాపు 45 నిమిషాల పాటు ఆయన్ను కాపాడేందుకు (CPR) తీవ్రంగా యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.
అర్ధరాత్రి అంత్యక్రియలు

గోవా నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో పూణే సమీపంలోని నానా పటేకర్ ఫామ్‌హౌస్‌కు తరలించారు. అనంతరం గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య కుమారుడు మల్హార్ పటేకర్ తండ్రికి చితిమంట పెట్టారు.
అర్ధరాత్రి ఎందుకంటే?
అంత్యక్రియలు అర్ధరాత్రి వేళ నిర్వహించడంపై కుమారుడు మల్హార్ స్పందిస్తూ.. "మేము గోవాలో ఉన్నాము. ఆయన పార్థివ దేహాన్ని గ్రామంలోని ఫామ్‌హౌస్‌కు తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఉదయమే ఈ విషాదం జరగడం, సమయం గడిచిపోవడంతో మరుసటి రోజు వరకు ఆగకుండా గురువారం రాత్రే అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలని కుటుంబసభ్యులంతా నిర్ణయించుకున్నాం" అని ఎమోషనల్ అవుతూ తెలిపారు.
మల్హార్ ఎమోషనల్ కామెంట్లు
తండ్రి అందించిన వారసత్వం గురించి మల్హార్ పాటేకర్ విలేకరులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "నానా సాహెబ్ లాంటి వ్యక్తులు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. వారు చేసే మంచి పనుల ద్వారా అమరులవుతారు. 'మానవత్వం పేరిట అందరం కలిసి లోక కళ్యాణం కోసం పనిచేద్దాం' అని ఆయన తరచుగా చెప్తుండేవారు. కరువు పీడిత ప్రాంతాల్లో జల సంరక్షణ కోసం మా 'నామ్ ఫౌండేషన్' (Naam Foundation) ద్వారా పనిచేస్తున్నాం.
అలాగే కాశ్మీర్లో విద్యా, వైద్య రంగాల్లో భారీ కార్యక్రమాలు ప్రారంభించాం. ఆయన వెళ్లేముందే అందరికీ నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం" అని మల్హార్ స్పష్టం చేశారు.
గొప్ప మానవతావాది
{{/usCountry}}అలాగే కాశ్మీర్లో విద్యా, వైద్య రంగాల్లో భారీ కార్యక్రమాలు ప్రారంభించాం. ఆయన వెళ్లేముందే అందరికీ నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు. ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం" అని మల్హార్ స్పష్టం చేశారు.
గొప్ప మానవతావాది
{{/usCountry}}భారతీయ సినీ చరిత్రలో నానా పాటేకర్ స్థానం ప్రత్యేకమైంది. 'పరిందా', 'క్రాంతివీర్', 'అపహరణ్' వంటి చిత్రాలలో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో మూడు జాతీయ పురస్కారాలను గెలుచుకోవడమే కాకుండా.. 'వెల్కమ్' వంటి కల్ట్ కామెడీ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించారు. అయితే, ఒక నటుడిగా ఆయన సాధించిన విజయాల కంటే, ఒక సామాజిక కార్యకర్తగా ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మహారాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలమంది రైతుల జీవితాలను మార్చింది.
మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు 'నామ్ ఫౌండేషన్' స్థాపించి, కోట్లాది రూపాయల నిధులను స్వయంగా సమకూర్చి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిన అరుదైన నటుడు ఆయన. సినీ గ్లామర్‌ను సామాజిక సేవకు మళ్లించడంలో ఆయన చూపిన మార్గం సమాజానికి ఆదర్శం.