Nani Anirudh: అమెరికా రోడ్లపై నాని, అనిరుధ్ స్టెప్పులు.. ఏషనాగుల పాట బీట్‌కు ఊగిపోతూ.. వీడియో వైరల్
Nani Anirudh: నాని ది పారడైజ్ మూవీ ప్రమోషన్ల హంగామా మామూలుగా లేదు. ఈ మధ్యే మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ ఏషనాగుల పాట ఓవైపు ఊపేస్తుండగా.. అదే పాటపై అమెరికా వీధుల్లో నాని, అనిరుధ్ వేసిన స్టెప్పులు మరో హైలైట్ గా నిలిచాయి.
Nani Anirudh: 'ది పారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అమెరికా వీధుల్లో చేసిన రచ్చ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ జానపద శైలిలో వచ్చిన 'ఏషనాగుల' పాటపై అమెరికా రోడ్లపై ఇద్దరూ రిక్షా తరహా వాహనంలో ప్రయాణిస్తూ మాస్ స్టెప్పులతో కేక పెట్టించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.

ది పారడైజ్ ప్రమోషన్లు.. రోడ్లపై డ్యాన్స్‌లు
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది పారడైజ్' (The Paradise). ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ సరికొత్త పంథాను ఎంచుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన తెలంగాణ ఫోక్ సాంగ్ 'ఏషనాగుల' (Yeshanagula) ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ పాటను యూఎస్ఏ (USA)లోని డల్లాస్‌లో జరిగిన ఒక భారీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన నాని, అనిరుధ్ రవిచందర్.. తాజాగా అమెరికా వీధుల్లో చేసిన సందడి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
అమెరికా వీధుల్లో ఒక రిక్షా తరహా ఓపెన్ వెహికల్ లో ప్రయాణిస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న 'ఏషనాగుల' మాస్ బీట్స్‌కు నాని, అనిరుధ్ పోటీపడి మరీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, వేలల్లో వ్యూస్, షేర్లతో వైరల్‌గా మారింది. హాలీవుడ్ స్ట్రీట్స్‌లో పక్కా తెలంగాణ ఫోక్ పాటకి మన స్టార్స్ చేసిన ఈ ఎనర్జెటిక్ రచ్చ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
జనంలోకి చొచ్చుకెళ్లిన 'ఏషనాగుల' జానపదం
అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, తెలంగాణ జానపద సోయగాలు మేళవించిన 'ఏషనాగుల' పాట ఆడియన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోయింది. ఈ ప్రత్యేకమైన పాటలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ కూడా మెరవడం విశేషం. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాట.. నాని-అనిరుధ్‌ల ఈ స్ట్రీట్ డ్యాన్స్ వీడియోతో ప్రమోషనల్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయిందనే చెప్పాలి.
'దసరా' కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ (Raghav Juyal) విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


