The Paradise: నాని ది ప్యారడైజ్ రికార్డు ప్రీరిలీజ్ బిజినెస్.. నేచురల్ స్టార్ కెరీర్లోనే అత్యధికం.. ఎంతంటే?
The Paradise Theatrical Business: నాని లీడ్ రోల్లో నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతని కెరీర్లోనే అత్యధిక మొత్తానికి ఈ హక్కులు అమ్ముడుపోవడం విశేషం.
Nani The Paradise Business: నేచురల్ స్టార్ నాని మార్కెట్ రేంజ్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఆయన అప్‌కమింగ్ మాసివ్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌లో ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.82 కోట్ల నుంచి రూ.84 కోట్ల రేంజ్‌లో బిజినెస్ నమోదు చేసి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా థియేట్రికల్ డీల్స్‌పైనే హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

నైజాం హక్కుల కోసం మైత్రి భారీ డీల్.. పార్ట్‌నర్స్‌గా నాగవంశీ
ది ప్యారడైజ్ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ.37 కోట్లకు (రూ.2 కోట్ల రికవరీ క్లాజ్‌తో) సొంతం చేసుకుంది. ఈ భారీ డీల్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి చెరో 25 శాతం వాటా దక్కించుకోవడం విశేషం. నైజాం ఏరియాలోనే ఈ రేంజ్ అమౌంట్ కోట్ చేయడం నాని స్టార్‌డమ్‌కి పర్ఫెక్ట్ నిదర్శనం అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
కోస్తాంధ్ర, సీడెడ్ లెక్కలు ఇవే.. పట్టువదలని ప్రొడ్యూసర్
కోస్తాంధ్ర హక్కుల వ్యవహారం కూడా రూ. 35 కోట్ల రేషియోలో క్లోజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో ఆంధ్ర ఏరియాలో బిజినెస్ లెక్కలు హాట్ కేకులా మారుతున్నాయి.
ఇక సీడెడ్ (రాయలసీమ) విషయానికి వస్తే ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి రూ.12 కోట్ల నాన్-రిఫండబుల్ అడ్వాన్స్ (NRA) కోరుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శోభన్ రూ.10 కోట్ల వరకు ఇచ్చేందుకు రెడీ అయినప్పటికీ, ప్రొడ్యూసర్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా పట్టుబట్టడం ఆసక్తికరంగా మారింది.
'హిట్ 3' రికార్డ్స్ అవుట్.. రెట్టింపు మార్కెట్ రేంజ్
గతంలో నాని నటించిన 'హిట్ 3' (HIT 3) సినిమా సాధించిన రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెసే ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో హయ్యెస్ట్ నంబర్‌గా ఉండేది. కానీ ఇప్పుడు 'ది ప్యారడైజ్' కేవలం ఏపీ, తెలంగాణ నుంచే దాదాపు రూ.84 కోట్ల మేర బిజినెస్ రాబట్టి పాత రికార్డులను డబుల్ మార్జిన్‌తో బద్దలు కొట్టింది.
'దసరా', 'సరిపోదా శనివారం' వంటి వరుస పాన్ ఇండియా హిట్లతో నాని మార్కెట్ పొటెన్షియల్ ఏ స్థాయిలో పెరిగిందో ఈ ట్రేడ్ ఫిగర్స్ స్పష్టంగా నిరూపిస్తున్నాయి.
సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.. 23నే సెన్సేషనల్ ప్రీమియర్స్
ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23నే ఇండియా వ్యాప్తంగా, అలాగే ఓవర్సీస్‌లో బిగ్ లెవెల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ బిజినెస్ లెక్కల ప్రకారం ఓపెనింగ్ డే రోజు నాని బాక్సాఫీస్ వద్ద సరికొత్త మైలురాళ్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


