ఓటీటీలోకి మూడు వారాల్లోనే వస్తున్న తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 7.9 రేటింగ్
విలక్షణ నటుడు నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'హనీ' (Honey). ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు, కథా విశేషాలు ఇక్కడ చూడండి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఆధారిత సినిమాలను ఎంచుకోవడంలో, విభిన్నమైన పాత్రలతో ప్రయోగాలు చేయడంలో నవీన్ చంద్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అతడు నటించిన లేటెస్ట్ మూవీ 'హనీ' (Honey) ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ?
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ హనీ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.
ఫిబ్రవరి 27 నుంచి 'హనీ' సినిమా స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా కంటెంట్ బేస్డ్ థ్రిల్లర్ సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువ ఆదరణ పొందుతాయి. అందుకే నిర్మాతలు డిజిటల్ రిలీజ్ పై ఆశలు పెట్టుకున్నారు. ఐఎండీబీలో ఈ మూవీకి 7.9 రేటింగ్ నమోదైంది.
అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. కరుణ కుమార్ గతంలో వరుణ్ తేజ్‌తో తీసిన మట్కా అనే సినిమా బాక్సాఫీస్ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది.
హనీ కథేంటంటే..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఒక భార్యాభర్తల కథ ఇది. ఆనంద్ (నవీన్ చంద్ర)కు క్షుద్ర విద్యల పట్ల అవగాహన ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసం అతను నైతికంగా తప్పు అని తెలిసినా, తన కూతురిని ఉపయోగించి ఒక రిస్క్ ప్లాన్ వేస్తాడు. కానీ ఆ ప్లాన్ బెడిసికొట్టి పరిస్థితులు అదుపు తప్పుతాయి. మూఢనమ్మకాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సంఘర్షణల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
దివ్యా పిళ్ళై, రాజా రవీంద్ర, దేవి ఇందులో కీలక పాత్రలు పోషించారు. అజయ్ ఆర్ సదా సంగీతం అందించారు. విమర్శకుల ప్రకారం నవీన్ చంద్ర ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, దేవి నటన బాగున్నాయి. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవీన్ చంద్ర బ్యాలెన్స్ చేస్తున్నప్పటికీ.. సోలో హీరోగా మాత్రం అతనికి అదృష్టం కలిసి రావడం లేదు. మరి ఈ సినిమా ఓటీటీలోనైనా ఆదరణ పొందుతుందో లేదో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


