...
...
Next Story

Nawab Cafe OTT Release Date: మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nawab Cafe OTT Release Date: తెలుగు ఎమోషనల్ డ్రామా నవాబ్ కేఫ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. రాజీవ్ కనకాల, శివ కందుకూరిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

Published on: Mar 6, 2026, 18:27:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. ఈ సినిమా పేరు నవాబ్ కేఫ్. ఈ సినిమాను మార్చి 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మార్చి 6) వెల్లడించింది. మరి ఆ వివరాలు, మూవీ స్టోరీ, ఇతర విశేషాలను ఇక్కడ చూడండి.

నవాబ్ కేఫ్ ఓటీటీ రిలీజ్

Nawab Cafe OTT Release Date: మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Nawab Cafe OTT Release Date: మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న తెలుగు ఎమోషనల్ డ్రామా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

రాజీవ్ కనకాల, శివ కందుకూరిలాంటి వాళ్లు నటించిన మూవీ నవాబ్ కేఫ్. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. “నవాబ్స్ కేఫ్.. కుటుంబం, కలలు, వారసత్వంలాంటి మనసుకు హత్తుకునే స్టోరీకి కామెడీని జోడించి చెప్పిన సినిమా. మార్చి 12న ప్రీమియర్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

నవాబ్ కేఫ్ మూవీ విశేషాలు

హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ ఛాయ్, ఆ ఛాయ్ చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ 'నవాబ్ కేఫ్' (Nawab Cafe). రాజీవ్ కనకాల, శివ కందుకూరి తండ్రీకొడుకులుగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా.. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. తొలుత 'చాయ్ వాలా' అనే టైటిల్‌తో ప్రచారం పొందినా, సెన్సార్ నిబంధనల వల్ల చివరి నిమిషంలో 'నవాబ్ కేఫ్'గా మారింది.

పాతబస్తీలోని నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన 'నవాబ్ కేఫ్' చుట్టూ ఈ కథ నడుస్తుంది. రంగనాథ్ (రాజీవ్ కనకాల) తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కేఫ్‌ను ప్రాణప్రదంగా చూసుకుంటాడు. లాభాల కంటే కస్టమర్ల తృప్తికే ప్రాధాన్యతనిచ్చే నిబద్ధత గల వ్యక్తి.

ఈ సినిమాలో తేజు అశ్విని ఫిమేల్ లీడ్ గా నటించింది. మూవీలో నటీనటుల నటనకు మంచి మార్కులే పడినా.. ఓవరాల్ గా సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. నవాబ్ కేఫ్ ఓ స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe