Netflix Crime Thriller: నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. పోలీసుగా తిరిగి వస్తున్న స్టార్ హీరో.. ట్రైలర్
Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన 'కర్తవ్య' సినిమా మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది.
Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లవర్స్ కోసం ఇప్పుడో ఇంట్రెస్టింగ్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు కర్తవ్య. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తున్న సైఫ్ అలీ ఖాన్.. మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 'భక్షక్' ఫేమ్ పుల్కిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించడం కోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని ప్రధానంగా చూపిస్తుంది.

కర్తవ్య మూవీ స్టోరీ ఇదీ..
ఈ కర్తవ్య సినిమాలో సైఫ్ అలీ ఖాన్ 'పవన్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఇది చాలా ఉత్కంఠగా సాగింది.
తన రక్షణలో ఉన్న ఒక జర్నలిస్టుపై దాడి జరగడంతో పవన్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటాడు. పై అధికారుల ఒత్తిడి, మరోవైపు తన తమ్ముడి వల్ల కుటుంబానికి ఎదురయ్యే ముప్పు.. ఈ రెండింటి మధ్య పవన్ ఎలా చిక్కుకున్నాడు? అధికారం, కుట్రలు నిండిన ఈ వ్యవస్థలో తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడు? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. "ప్రతి నిర్ణయం ఒక సవాలు.. ప్రతి విధి ఒక కర్తవ్యం" అనే సందేశంతో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంటోంది.
కర్తవ్య మూవీ విశేషాలు
ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌తో పాటు రసికా దుగ్గల్, సంజయ్ మిశ్రా, జాకీర్ హుస్సేన్, మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ జర్నలిస్ట్ సౌరభ్ ద్వివేది ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతుండటం విశేషం. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాను మే 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
గతంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా తొలి వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ లోనూ సైఫ్ అలీ ఖాన్ పోలీసు పాత్రలో నటించాడు. ఆ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ఇండియన్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సైఫ్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ గా మరో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. మరి ఈ కర్తవ్య మూవీ ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
- 'కర్తవ్య' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
ఈ చిత్రం మే 15, 2026న విడుదల కాబోతోంది.
2. సైఫ్ అలీ ఖాన్ కర్తవ్య సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది?
ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.
3. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తున్నారు?
ఆయన 'పవన్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


