నెట్‌ఫ్లిక్స్ లో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉన్నాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన సిరీస్ ఢిల్లీ క్రైమ్. షెఫాలీ షా లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు మూడో సీజన్ రాబోతోంది. తాజాగా గురువారం (అక్టోబర్ 16) మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఫైనల్‌గా వచ్చేసింది. షెఫాలీ షా, హుమా ఖురేషి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సిరీస్ నవంబర్‌లో రాబోతోంది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఒక డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నవంబర్ మధ్యలో రిలీజ్ అవుతుందని కొన్ని రోజుల కిందట రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ వార్త నిజమని కన్ఫర్మ్ అయింది.
'ఢిల్లీ క్రైమ్' మేకర్స్ సీజన్ 3 కోసం ఒక డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో 'బడీ దీదీ' గురించి ఒక హింట్ ఇచ్చారు. ఈ రోల్‌ని హుమా ఖురేషి చేసినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌తో ఆమె ఈ ఫ్రాంచైజీలోకి మెయిన్ విలన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ వీడియో చివర్లో షో టైటిల్ ద్వారానే ప్రీమియర్ డేట్‌ని అనౌన్స్ చేశారు.
'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' గురించి
షెఫాలీ షా 'మేడమ్ సర్' వర్తికా చతుర్వేదిగా, ఆమె టీమ్‌లో రసికా దుగల్ (నీతి సింగ్), రాజేష్ తైలాంగ్ (ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్) నటిస్తున్నారు. 'ఢిల్లీ క్రైమ్ సీజన్ 3' హ్యూమన్ ట్రాఫికింగ్, అబ్యూస్‌కి సంబంధించిన కేసు. ఈ సీజన్‌ని 'బేబీ ఫలక్ కేసు' ఆధారంగా తీశారని అంటున్నారు. ఈ కథ ఫలక్ అనే రెండేళ్ల పాప చుట్టూ తిరుగుతుంది. ఆ పాప తలకు గాయాలు, మనుషులు కొరికిన గాట్లు లాంటి తీవ్రమైన హింసను ఎదుర్కొంది.
ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురైందని తేల్చారు. తానే తల్లిని అని చెప్పుకున్న 15 ఏళ్ల అమ్మాయి ఫలక్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి తీసుకొచ్చింది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆ టీనేజ్ అమ్మాయి కూడా ట్రాఫికింగ్, అబ్యూస్‌కి గురైందని, ఒక పెద్ద వయసు వ్యక్తి ఆమెను మోసం చేసి వాడుకున్నాడని తెలిసింది. ఈ కేసు పిల్లల మీద అఘాయిత్యాలు, బలవంతపు వ్యభిచారం, రహస్య పెళ్లిళ్లు చేసే ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని బయటపెట్టింది. ఇందులో ఆ మనుషుల అక్రమ రవాణాకు కారణమయ్యే బడీ దీదీ పాత్రలోనే హుమా ఖురేషీ నటించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
{{/usCountry}}ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురైందని తేల్చారు. తానే తల్లిని అని చెప్పుకున్న 15 ఏళ్ల అమ్మాయి ఫలక్ని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కి తీసుకొచ్చింది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆ టీనేజ్ అమ్మాయి కూడా ట్రాఫికింగ్, అబ్యూస్‌కి గురైందని, ఒక పెద్ద వయసు వ్యక్తి ఆమెను మోసం చేసి వాడుకున్నాడని తెలిసింది. ఈ కేసు పిల్లల మీద అఘాయిత్యాలు, బలవంతపు వ్యభిచారం, రహస్య పెళ్లిళ్లు చేసే ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ని బయటపెట్టింది. ఇందులో ఆ మనుషుల అక్రమ రవాణాకు కారణమయ్యే బడీ దీదీ పాత్రలోనే హుమా ఖురేషీ నటించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
{{/usCountry}}