మా సినిమా టైటిల్ మార్చేస్తాం.. కొత్త టైటిల్ ఇలా ఉండదు: సుప్రీంకోర్టుకు చెప్పిన నెట్‌ఫ్లిక్స్ మూవీ మేకర్స్

నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా రాబోతున్న మనోజ్ బాజ్‌పాయీ మూవీ ఘూర్‌ఖోర్ పండత్ టైటిల్ మారిపోనుంది. ఈ విషయాన్ని మేకర్స్ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. బ్రాహ్మణులను అవమానించేలా ఉన్న ఈ టైటిల్ కేసు నమోదు కావడంతో మేకర్స్ దిగి వచ్చారు.

Published on: Feb 19, 2026, 15:33:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ రాబోయే నెట్‌ఫ్లిక్స్ సినిమా టైటిల్ వివాదం మొత్తానికి ముగిసింది. 'ఘూస్‌ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే టైటిల్‌తో పాటు దానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను ఉపసంహరించుకున్నట్లు దర్శకుడు నీరజ్ పాండే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు. దీంతో కోర్టు ఈ కేసుకు ముగింపు పలికింది.

మా సినిమా టైటిల్ మార్చేస్తాం.. కొత్త టైటిల్ ఇలా ఉండదు: సుప్రీంకోర్టుకు చెప్పిన నెట్‌ఫ్లిక్స్ మూవీ మేకర్స్
మా సినిమా టైటిల్ మార్చేస్తాం.. కొత్త టైటిల్ ఇలా ఉండదు: సుప్రీంకోర్టుకు చెప్పిన నెట్‌ఫ్లిక్స్ మూవీ మేకర్స్

టైటిల్ మార్పుపై దర్శకుడి స్పష్టత..

ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న తాజా నెట్‌ఫ్లిక్స్ మూవీ ఘూస్‌ఖోర్ పండత్. అంటే లంచాలకు మరిగిన పండిత్ అని అర్థం. ఈ టైటిల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 19) విచారణ జరిపింది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, దీని విడుదలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించి పరిష్కరించింది.

జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం నీరజ్ పాండే సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ కేసును ముగించింది. వివాదాస్పదమైన 'ఘూస్‌ఖోర్ పండిట్' టైటిల్‌ను పూర్తిగా ఉపసంహరించుకున్నామని, భవిష్యత్తులో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని నీరజ్ పాండే కోర్టుకు స్పష్టం చేశాడు.

ఇక కొత్త టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని, అయితే అది పాత టైటిల్‌ను పోలి ఉండదని అతడు హామీ ఇచ్చాడు. కొత్త పేరు పూర్తిగా సినిమా కథాంశానికి అద్దం పట్టేలా ఉంటుందని, మళ్లీ వివాదాలకు తావు ఇవ్వదని అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.

సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు..

ఈ కేసు విచారణ సందర్భంగా ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కళాత్మక స్వేచ్ఛ ముసుగులో సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. సృజనాత్మకతకు, సామాజిక బాధ్యతకు మధ్య సమతుల్యత పాటించడం సినిమా పరిశ్రమ బాధ్యత అని ధర్మాసనం నొక్కిచెప్పింది.

నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ఒక అవినీతి, కుట్రల వలయంలో చిక్కుకున్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో నుష్రత్ భరూచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్యా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More