...
...
Next Story

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్యూట్ ఫ్యామిలీ మూవీ.. దీపావళికి నాలుగు రోజులు కలిసే ఫ్యామిలీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Netflix: నెట్‌ఫ్లిక్స్ లో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోంది. దీపావళి పండుగ సందర్భంగా నాలుగు రోజులు కలిసి గడిపే ఓ ఫ్యామిలీ చుటూట్ తిరిగే ఈ సినిమాను అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది.

Published on: Oct 15, 2026, 22:09:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix: ఓటీటీ ప్రియులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తూ ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో సిద్ధమైంది. ప్రముఖ రచయిత్రి రాధికా బన్సల్ (Radhika Bansal) దర్శకురాలిగా పరిచయమవుతున్న తొలి చిత్రం 'మీఠే మే క్యా హై' (Meethe Mein Kya Hai) ఫస్ట్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్యూట్ ఫ్యామిలీ మూవీ.. దీపావళికి నాలుగు రోజులు కలిసే ఫ్యామిలీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్యూట్ ఫ్యామిలీ మూవీ.. దీపావళికి నాలుగు రోజులు కలిసే ఫ్యామిలీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

దీపావళి పండుగ (Diwali 2026) సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 30 నుంచి ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కుటుంబ బంధాలు, అనుబంధాలు, పండుగ వేళ జరిగే సరదా అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ఉత్థాన్ క్యాపిటల్ సమర్పణలో అజిత్ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా లైట్-హార్టెడ్ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందింది.

నాలుగు రోజుల దీపావళి వేడుకల నేపథ్యంలో సాగే కథ

ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఒక సాధారణ కుటుంబం దీపావళి పండుగ సందర్భంగా నాలుగు రోజుల పాటు కలిసి గడపడం, ఆ సమయంలో వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదాలు, మారుతున్న బంధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలను, మనుషుల మధ్య బంధాలను ఎంతో సహజంగా, కామెడీ ఉట్టిపడేలా ఈ చిత్రంలో చూపించారు. జనరేషన్ గ్యాప్స్, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ఈ మూవీని తెరకెక్కించినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

దర్శకురాలు రాధికా బన్సల్ తన వ్యక్తిగత అనుభవాలను, జ్ఞాపకాలను అక్షర రూపంలో పెడుతూ ఈ కథను సిద్ధం చేశారు. మొదట్లో జర్నల్ రాయడం అలవాటుగా ఉన్న ఆమె, క్రమంగా వాటిని కల్పిత కథలుగా మలచడం ప్రారంభించారు. అలా కేవలం మూడు నెలల తక్కువ సమయంలోనే ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, ఎలాంటి ముందస్తు డైరెక్షన్ అనుభవం లేకుండానే కేవలం పదకొండు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం.

హేమాహేమీలైన నటీనటుల కలయిక

దీపావళి పండుగ సెలవుల్లో కుటుంబంతో కలిసి చూడదగ్గ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks