Netflix Releases: హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రానున్న టాప్ 10

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ లోకి అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రానున్న టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్, రియాల్టీ షోల వివరాలు ఇక్కడ చూడండి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతోంది.

Published on: Oct 12, 2026, 15:15:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Releases: ఓటీటీ ప్రియులకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈసారి సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 10 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ల వరకు ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగినట్లుగా కంటెంట్ క్యూ కట్టింది.

Netflix Releases: హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రానున్న టాప్ 10
Netflix Releases: హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ కామెడీ వరకు.. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 12 నుంచి 18 మధ్య రానున్న టాప్ 10

మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ పాపులర్ షోలు, క్రైమ్ థ్రిల్లర్లు ఈ వీకెండ్‌లో బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ఆ టాప్ టెన్ ప్రాజెక్ట్స్ విశేషాలు ఇక్కడ చూద్దాం.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే టాప్ 10 లిస్ట్ ఇదే

1. రోడీస్ రీబర్త్ (Roadies Rebirth) - అక్టోబర్ 16: కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో రోడీస్ కొత్త సీజన్ రాబోతోంది. రణ్‌విజయ్ సింగ్ హోస్ట్ చేస్తుండగా, అభిషేక్ మహాన్, బషీర్ అలీ, ప్రిన్స్ నరులా, నేహా ధూపియా, నిఖిల్, బాణీ జె లు గ్యాంగ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

2. ది ట్రాప్ (The Trap) - అక్టోబర్ 13: ఒక చెల్లెలి హత్య తర్వాత 10 సంవత్సరాలు బయటకు రాకుండా గడిపిన ఆథర్ లిసా కాన్రాడ్ కథతో రూపొందిన జర్మన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది.

3. హార్మోనల్: సుముఖి సురేష్ (Hormonal) - అక్టోబర్ 14: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సుముఖి సురేష్ సింగిల్ లైఫ్, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, డేటింగ్ డిజాస్టర్లపై నవ్వులు పూయించే స్పెషల్ షో.

4. ఈవిల్ డెడ్ బర్న్ (Evil Dead Burn) - అక్టోబర్ 16: సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ మూవీ. భర్త మరణం తర్వాత అత్తగారింటికి వెళ్లిన ఐస్ జీవితంలో జరిగే వింత సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది.

5. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ (Final Destination Bloodlines) - అక్టోబర్ 16: సూపర్ నేచురల్ హారర్ జోనర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫైనల్ డెస్టినేషన్' సిరీస్ నుంచి వస్తున్న ఆరో భాగం ఇది.

6. ద స్టార్మ్ (The Storm) - అక్టోబర్ 15: జోసెఫిన్ బోర్న్‌బుష్ డైరెక్ట్ చేసిన డార్క్ కామెడీ సినిమా. పుట్టినరోజు వేడుక కోసం ఒక లాడ్జికి వెళ్లిన స్నేహితులు తుఫానులో చిక్కుకుని.. బయటపెట్టే నిజాల చుట్టూ ఇది తిరుగుతుంది.

7. మనీ ట్రాప్: ది కార్టూన్ ట్రెజర్ (Money Trap) - అక్టోబర్ 16: టర్కిష్ కామెడీ క్రైమ్ షో. నేర ప్రపంచం వీడే ముందు ఒక దొంగ.. తనకు దొరికిన నిధి మ్యాప్ ఆధారంగా సాహసయాత్ర చేసే కథ ఇది.

8. టైసన్ (Tyson) - అక్టోబర్ 13: అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ జీవిత విశేషాలతో కూడిన 4 ఎపిసోడ్‌ల ఇంటెన్స్ డాక్యుమెంటరీ సిరీస్.

9. వితిన్ (Within) - అక్టోబర్ 15: ఒక కొత్త ఇంటికి మారిన భార్యాభర్తలు, వారి కూతురు ఎదుర్కొన్న భయానక అనుభవాలతో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ఇది.

10. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon) - అక్టోబర్ 13: వైకింగ్స్, డ్రాగన్ల మధ్య సాగే పోరాటం ఆధారంగా రూపొందిన ఫ్యామిలీ అడ్వెంచర్ యానిమేషన్ చిత్రం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More