OTT Horror: థియేటర్లలో కాకుండా నేరుగా టీవీలో రిలీజ్- రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- ఎక్కడ చూడాలంటే?

Adbhut OTT Streaming After 2 Years: ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా అద్భుత్. మొదట థియేటర్లలో కాకుండా టీవీలో ప్రీమియర్‌గా ప్రసారం చేసిన అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. వెంకటేష్ సైంధవ్ విలన్ నటించిన అద్భుత్ ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 12, 2026, 14:56:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Adbhut OTT Release After 2 Years From TV Premiere: విలక్షణ నటుడు, సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన క్రైమ్, హారర్ చిత్రాలకు ఓటీటీల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తెలుగు ఓటీటీ ప్రియులు మిస్టరీ, సూపర్ నేచురల్, హారర్ అంశాలతో కూడిన కథలను అమితంగా ఇష్టపడతారు.

థియేటర్లలో కాకుండా నేరుగా టీవీలో రిలీజ్- రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- ఎక్కడ చూడాలంటే?
థియేటర్లలో కాకుండా నేరుగా టీవీలో రిలీజ్- రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి టీవీ ప్రీమియర్ హారర్ థ్రిల్లర్

ఈ క్రమంలోనే గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత్ ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చేసింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అద్భుత్ ఓటీటీ రిలీజ్ అయింది. మొదట థియేటర్లలో కాకుండా నేరుగా బుల్లితెరపై టీవీ ప్రీమియర్ అయిన అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది.

అద్భుత్ చిత్రానికి 'హీరోపంతి', 'బాఘి', 'మున్నా మైఖేల్' వంటి విజయవంతమైన మాస్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాధారణంగా భారీ థియేట్రికల్ రిలీజ్‌లకే ప్రాధాన్యం ఇచ్చే సబ్బీర్ ఖాన్, ఈసారి పూర్తి భిన్నమైన సూపర్ నేచురల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు.

'సోనీ మ్యాక్స్' టీవీ ఛానెల్‌లో నేరుగా ప్రసారం అయిన అద్భుత్ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు డయానా పెంటీ, శ్రేయా ధన్వంతరి, రోహన్ మెహ్రా ప్రధాన పాత్రలు పోషించారు.

అసలు కథేంటంటే?

ఇక అద్భుత్ కథ విషయానికి వస్తే, ప్రైవేట్ డిటెక్టివ్ గజరాజ్ అవస్థి (నవాజుద్దీన్ సిద్ధిఖీ) పోలీస్ శాఖ నుంచి సన్మానం అందుకునే ఘట్టంతో సినిమా ప్రారంభమవుతుంది. తన కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన కేసు గురించి అడిగినప్పుడు, ఐదేళ్ల క్రితం షిమ్లా కొండల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనను అతను గుర్తుచేసుకుంటాడు.

గుడ్ లైఫ్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ఆదిత్య రావత్ (రోహన్ మెహ్రా), అతని భార్య డాక్టర్ శ్రుతి రావత్ (శ్రేయా ధన్వంతరి) షిమ్లా సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. శ్రుతి తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్ వాడుతుంటుంది. మరోవైపు కొత్త ఇంట్లోకి వెళ్లిన కొద్ది రోజులకే అక్కడ ఊహించని భయానక సంఘటనలు మొదలవుతాయి.

ఒక అదృశ్య శక్తి ఆ దంపతులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. పరిణామాలు చేయి దాటిపోతుండటంతో ఆదిత్య, శ్రుతి కలిసి ప్రైవేట్ డిటెక్టివ్ గజరాజ్ అవస్థిని ఆశ్రయిస్తారు. రంగంలోకి దిగిన గజరాజ్ విచారణ ప్రారంభించినప్పటికీ, ఆ ఇంట్లో జరుగుతున్న భయానక పరిణామాల వెనుక అసలు కారణం ఏంటో వెంటనే కనిపెట్టలేకపోతాడు.

రహస్య మహిళ 'మేరీ' ఎవరు?

హాస్పిటల్‌కు సంబంధించిన ఒక వేడుకలో ఆదిత్య, శ్రుతి ప్రాణాలు తృటిలో తప్పించుకునే ప్రమాదం జరుగుతుంది. ఆ ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన గజరాజ్‌కు మేరీ మ్యాథ్యూస్ (డయానా పెంటీ) అనే అనుమానాస్పద మహిళ కనిపిస్తుంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలు కానీ, వివరాలు కానీ ఎక్కడా లభించవు. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు గజరాజ్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తాయి.

లోతుగా పరిశోధించగా, గతంలో కొమాలో ఉన్న అమీ ఆర్. మ్యాథ్యూస్ అనే పేషెంట్ మృతికి డాక్టర్ ఆదిత్య, శ్రుతి కారణమనే షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ పాత ఘటనకు, ఇప్పుడు జరుగుతున్న పారానార్మల్ దాడులకు ఉన్న సంబంధం ఏంటి? మేరీ మ్యాథ్యూస్ అసలు నిజమా లేక ఆత్మ రూపమా? అనే ఉత్కంఠభరిత ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్

నవాజుద్దీన్ సిద్ధిఖీ మార్క్ సీరియస్ యాక్టింగ్, ఉత్కంఠ రేకెత్తించే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. సాధారణంగా వచ్చే దెయ్యం సినిమాలాగ కాకుండా, సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ కోణంలో సబ్బీర్ ఖాన్ ఈ చిత్రాన్ని మలిచారు. ట్విస్టులు, సస్పెన్స్‌తో భయపెట్టే అద్భుత్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది.

అక్టోబర్ 9 నుంచి జియోహాట్‌స్టార్‌లో అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో హారర్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు జియో హాట్‌స్టార్ ఓటీటీలోని అద్భుత్ సినిమా మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More