OTT Thriller: ఓటీటీలోకి సూపర్ హిట్ సోషల్ థ్రిల్లర్ లీగల్ డ్రామా- జీవితాన్ని తలకిందులు చేసే నిజాయితీ-తెలుగులో-9.3 రేటింగ్
Enna Vilai OTT Streaming In Telugu: ఓటీటీలోకి సూపర్ హిట్ సోషల్ థ్రిల్లర్ లీగల్ డ్రామా చిత్రం ఎన్న విలై వచ్చేయనుంది. మనిషికి ఉన్న నిజాయితీ తన జీవితాన్నే తలకిందులు చేస్తే ఎలా ఉంటుందనే కథతో తెరకెక్కిన ఈ సినిమాకు 9.3 రేటింగ్ ఉంది. మరి ఇలాంటి ఎన్న విలై ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Enna Vilai OTT Release In Telugu: రామేశ్వరం సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఒక సామాన్యుడి పోరాటం ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు కరుణాస్, వర్సటైల్ యాక్ట్రెస్ నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ థ్రిల్లర్ లీగల్ డ్రామా ఎన్న విలై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఐఎమ్‌డీబీ రేటింగ్
ఎన్న విలై అంటే ధర ఎంత? లేదా నిజాయితీ (Price Of Dignity) విలువ ఎంత? అనే అర్థాలు వస్తున్నాయి. థియేటర్లలో సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ వచ్చింది. అలాంటి ఎన్న విలై ఓటీటీలోకి వచ్చేయనుంది.
జీవితాన్ని తలకిందులు చేసే బంగారు లాకెట్
"ఒక్క చిన్న బంగారు లాకెట్ ఒక కుటుంబ జీవితాన్నే తలకిందులు చేయగలదా?" అని ప్రశ్నిస్తూ నిర్మాతలు ఓటీటీ విడుదల తేదీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక చిన్న వస్తువు మనిషి నిజాయితీని, అతడి కుటుంబ భవిష్యత్తును ఏ విధంగా పరీక్షించిందో తెలిపే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
కథా నేపథ్యం – సముద్రంలో లభించిన నిజాయితీ!
రామేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులు సముద్రంలో వేసే నాణేలను ఏరుకుంటూ జీవించే తవసి ముత్తు అనే పేద కుటుంబీకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పిల్లలకు మంచి చదువు, మెరుగైన భవిష్యత్తు అందించడానికి సముద్ర గర్భంలో నాణేల కోసం నిత్యం మునకలు వేస్తుంటాడు.
ఒకరోజు నీటిలో అతడికి అత్యంత విలువైన బంగారు లాకెట్ దొరుకుతుంది. ఆభరణాన్ని రహస్యంగా దాచుకోకుండా, అధికారులకు అప్పగించాలని తవసి ముత్తు నిర్ణయించుకుంటాడు. అయితే అతడు తీసుకున్న ఆ మంచి నిర్ణయమే అతడిని అనేక చిక్కుల్లో పడేస్తుంది.
నిజాయితీగా ఉన్నందుకు మెప్పు లభించకపోగా, దొంగతనం ఆరోపణలు, వ్యవస్థ నుంచి బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలోని అసమానతలు, పేదరికం, పెద్ద శక్తుల మధ్య నలిగిపోయే సామాన్యుడి ఆవేదనను దర్శకుడు ఎంతో ప్రామాణికంగా తెరకెక్కించారు. ఒక అధికారి అతడికి మద్దతుగా నిలిచేవరకు తవసి ముత్తు పడిన వేదన ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
ఆకట్టుకునే సాంకేతిక బృందం
ఎన్న విలై చిత్రానికి సజీవ్ పాజూర్ దర్శకత్వం వహించగా, గిరీష్ విశ్వంభరన్, అనుగోపాల్ వేణుగోపాలన్ సంయుక్తంగా నిర్మించారు. సామ్ సి.ఎస్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఉద్వేగాలను మరింతగా పెంచింది. అల్బీ ఆంటోనీ ఛాయాగ్రహణం, శ్రీజిత్ సారంగ్ కూర్పు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
కరుణాస్, నిమిషా సజయన్లతో పాటు విజయలక్ష్మి వీరమణి, షాషా శివకుమార్, నిళల్గల్ రవి, పూర్ణిమ భాగ్యరాజ్, చేతన్ సీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథాబలం ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. ఐదు భాషల్లో రిలీజ్!
ఎన్న విలై చిత్రాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్న విలై ఓటీటీ రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


