...
...
Next Story

OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈరోజే వచ్చిన థ్రిల్లర్ మూవీ.. అదిరిన యాక్షన్ అదొక్కటే మిస్సింగ్.. గాంధారి రివ్యూ

OTT Review: తాప్సీ పన్ను లీడ్ రోల్లో నటించిన థ్రిల్లర్ మూవీ గాంధారి నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. కిడ్నాప్ అయిన కూతురి కోసం ఓ కళ్లు లేని తల్లి చేసే పోరాటం చుట్టూ తిరిగే ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.

Published on: Sep 3, 2026, 15:16:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Review: కిడ్నాప్ అయిన తన కూతురి కోసం కంటిచూపు కోల్పోయినా సరే ఒక తల్లి చేసే పోరాటమే 'గాంధారి' సినిమా. దేవాశిష్ మఖీజా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ నటి తాప్సీ పన్ను లీడ్ రోల్‌లో నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా అడుగుపెట్టింది ఈ మూవీ. సీట్ ఎడ్జ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో మెప్పించిన ఈ సినిమా ఆడియన్స్‌కి ఆశించిన స్థాయిలో ఎమోషనల్ హై ఇచ్చిందా? లేదా అన్నది ఈ రివ్యూలో చూడండి.

గాంధారి మూవీ కథేంటంటే..?

OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈరోజే వచ్చిన థ్రిల్లర్ మూవీ.. అదిరిన యాక్షన్ అదొక్కటే మిస్సింగ్.. గాంధారి రివ్యూ
OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈరోజే వచ్చిన థ్రిల్లర్ మూవీ.. అదిరిన యాక్షన్ అదొక్కటే మిస్సింగ్.. గాంధారి రివ్యూ

జోయ్‌పురా ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా బాణి (తాప్సీ పన్ను) కళ్లముందే ఆమె చిన్నారి కూతురు కిడ్నాప్‌కి గురవుతుంది. కూతురిని కాపాడుకునే క్రమంలో జరిగిన ఒక ప్రమాదంలో బాణి తాత్కాలికంగా కంటిచూపు కోల్పోతుంది. పోలీసుల నుంచి ఎలాంటి సాయం లభించకపోవడంతో, తన భర్త (ఇష్వాక్ సింగ్)తో కలిసి బాణి స్వయంగా కూతురి కోసం వెతకడం మొదలుపెడుతుంది.

ఆ ఊరిలో వరుసగా చిన్నపిల్లలు మాయమవుతుండటంతో కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ (జతిన్ సర్నా) కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. చూపు లేకపోయినా సరే తన కూతురిని వెతుక్కుంటూ బాణి ఎంత దూరం వెళ్లింది? ఆ క్రమంలో ఎదురైన కిడ్నాపింగ్ రాకెట్‌ను ఎలా అంతమొందించింది అనేదే మిగతా కథ.

గాంధారి మూవీ ఎలా ఉందంటే?

కూతురి కోసం ఓ తల్లి ఎంత వరకూ వెళ్తుందన్నకోర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా గాంధారి. కూతురిని కోల్పోయి, చుట్టూ ఉన్న వ్యవస్థ నుంచి ఎలాంటి మద్దతు లభించనప్పుడు ఒక ఒంటరి తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ మూవీ స్టోరీ. తాప్సీ యాక్షన్ సీన్స్, డైరెక్టర్ దేవాశిష్ మఖీజా మేకింగ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్.

తల్లి సెంటిమెంట్, ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా తల్లి కిడ్నాప్ డ్రామా అనగానే మనకు విద్యాబాలన్ 'కహానీ' సినిమా గుర్తొస్తుంది. అందులో కోల్‌కతా సిటీ ఒక క్యారెక్టర్‌లా మారి కథలోకి మనల్ని తీసుకెళ్తుంది. విద్యాబాలన్ యాక్టింగ్ మనల్ని కంటతడి పెట్టిస్తుంది.

కానీ 'గాంధారి' విషయంలో ఆ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు. శ్రీదేవి 'మామ్', కాజోల్ 'మా', ఐశ్వర్యారాయ్ 'జజ్బా' సినిమాల్లోని మదర్ ఎమోషన్ ఇక్కడ మిస్సయింది. తాప్సీ నటన బాగున్నా, క్యారెక్టర్ బ్యాక్‌స్టోరీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం వల్ల ఆడియన్స్ ఆమె పడే ఆవేదనకు పూర్తిగా కనెక్ట్ కాలేరనిపిస్తుంది.

గాంధారి.. ఎవరెలా చేశారంటే?

తాప్సీ పన్ను రోల్ విషయానికొస్తే యాక్షన్, స్టంట్ సీన్స్‌లో ఆమె దుమ్మురేపారు. భర్తగా నటించిన ఇష్వాక్ సింగ్ తన పరిధి మేర మెప్పించారు. విలన్ రోల్‌లో ప్రశాంత్ నారాయణన్ ఎంట్రీ చాలా ఆలస్యంగా జరగడమే కాకుండా, అతని క్యారెక్టర్‌లో భయం పుట్టించే విలనిజం లోపించింది.

షోర్ పోలీస్ అందించిన మ్యూజిక్ సినిమా ఎమోషన్‌ను ఎలివేట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఓవరాల్‌గా 'గాంధారి' ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల సగటు థ్రిల్లర్‌గానే మిగిలిపోయింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe