Prabhas Saaho Leaving Netflix Soon: 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' చిత్రాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అసాధారణ రికార్డులు సృష్టించిన తర్వాత, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం 2019లో విడుదలై యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఓటీటీలో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసే ప్రభాస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగుస్తుండటంతో, డిసెంబర్ 7, 2026న 'సాహో' నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుంచి తొలగిపోనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హిందీ ఆడియన్స్‌కు చివరి ఛాన్స్.. మరి తెలుగు వెర్షన్ సంగతేంటి?
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా చూసేందుకు అభిమానులకు ఇక కొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. నెట్‌ఫ్లిక్స్ వేదికపై 'సాహో' కేవలం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్తరాది ప్రభాస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను చూడటానికి డిసెంబర్ 7 చివరి అవకాశం కానుంది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల వెర్షన్లు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
బాక్సాఫీస్ వద్ద 'సాహో' రికార్డులు, మ్యూజిక్ విశేషాలు
'రన్ రాజా రన్' వంటి ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌ను నమ్మి యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. 2019 ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ డబ్బింగ్ చిత్రంగా 'సాహో' నిలిచింది.
{{/usCountry}}'రన్ రాజా రన్' వంటి ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్‌ను నమ్మి యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. 2019 ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ డబ్బింగ్ చిత్రంగా 'సాహో' నిలిచింది.
{{/usCountry}}ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.359 కోట్లు రాగా.. ఓవర్సీస్ లో రూ.92 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ లో రూ.152 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ గా నిలవగా.. హిందీ వెర్షన్ రూ.167 కోట్లతో హిట్ అయింది.
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మందిరా బేడీ కీలక పాత్రలు పోషించారు. తనిష్క్ బాగ్చి, గురు రంధావా, బాద్షా, శంకర్-ఎహసాన్-లాయ్ పాటలు అందించగా, ఎస్. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లారు. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ చూడాలనుకునే వారు డిసెంబర్ 7లోగా మరోసారి ఈ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదించవచ్చు.