Super Subbu Trailer: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. కొన్నాళ్లుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా సందీప్ నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ రేపు రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
సూపర్ సుబ్బు ట్రైలర్

నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన తొలి తెలుగు వెబ్ సిరీస్ గా ఈ సూపర్ సుబ్బు ప్రత్యేకత సంపాదించుకుంది. ఈ సిరీస్ ను జులై 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
ఇక బుధవారం (జూన్ 24) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. “ఎంతో అసౌకర్యానికి గురి చేసే సంభాషణే సుబ్బు ఫుల్ టైమ్ జాబ్ లాగా మారిపోయింది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేస్తూ.. ట్రైలర్ ను రేపు లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఓ ఫన్నీ పోస్టర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ విశేషాలు
'ఛోటా భీమ్' ఫేమ్ రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతులు తమ చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యానిమేషన్, కిడ్స్ కంటెంట్ లో టాప్ లో ఉన్న ఈ ప్రొడక్షన్ హౌస్.. ఒక మెయిన్ స్ట్రీమ్ లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టడం టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ అంటే 'రానా నాయుడు' లేదా 'సేక్రెడ్ గేమ్స్' లాంటి డార్క్, గ్రిట్టీ క్రైమ్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనే ముద్ర ఉంది. కానీ టాలీవుడ్ లోకల్ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించాలంటే పక్కా రీజనల్ కామెడీయే ఏకైక మార్గమని ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్ గ్రహించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నేరుగా నిర్మించిన తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
మల్లిక్ రామ్ ఈ కామెడీ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మురళీ శర్మ, గెటప్ శ్రీనులాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్.. ఈ వెబ్ సిరీస్ లో ఓ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించడమే అన్నింటి కంటే ఆసక్తి రేపుతోంది. మరి ఈ సిరీస్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది? ఇది తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేపనుంది అన్నది తేలాలంటే మరికొన్ని గంటలు ఆడాలి.
{{/usCountry}}మల్లిక్ రామ్ ఈ కామెడీ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మురళీ శర్మ, గెటప్ శ్రీనులాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న సందీప్ కిషన్.. ఈ వెబ్ సిరీస్ లో ఓ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ గా నటించడమే అన్నింటి కంటే ఆసక్తి రేపుతోంది. మరి ఈ సిరీస్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది? ఇది తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తిని రేపనుంది అన్నది తేలాలంటే మరికొన్ని గంటలు ఆడాలి.
{{/usCountry}}