Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో హడలెత్తిస్తున్న 8 ఎపిసోడ్ల థ్రిల్లర్ వెబ్ సిరీస్.. హత్య చేసి అవయవాలు మాయం చేసి..
Netflix Thriller: బాలీవుడ్ నటి వాణి కపూర్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సరికొత్త డార్క్ మైథలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మండల మర్డర్స్' (Mandala Murders). 'నెట్‌ఫ్లిక్స్' (Netflix)లో అందుబాటులో ఉన్న ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్.. సీట్-ఎడ్జ్ ట్విస్టులు, చేతబడుల బ్యాక్‌డ్రాప్‌తో వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
Netflix Thriller: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రోజురోజుకూ క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. అయితే కేవలం సాధారణ హత్యల మిస్టరీ మాత్రమే కాకుండా.. దానితో పాటు మూఢనమ్మకాలు, చేతబడులు (Black Magic), తంత్ర-మంత్రాలు, పౌరాణిక నేపథ్యాన్ని మిక్స్ చేసి తెరకెక్కించిన సిరీస్‌లు చాలా అరుదుగా వస్తుంటాయి. సరిగ్గా అదే కోవకు చెందిన గ్రిప్పింగ్ డార్క్ థ్రిల్లర్ 'మండల మర్డర్స్' (Mandala Murders).

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వాణి కపూర్ (Vaani Kapoor) ఓటీటీ అరంగేట్రం చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ హబ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. 'మర్దాని 2' ఫేమ్ గోపి పుత్రన్ (Gopi Puthran) దర్శకత్వం వహించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ ఆడియెన్స్‌ను స్క్రీన్ ముందు కట్టి పడేస్తోంది. ప్రముఖ నవలా రచయిత మహేంద్ర జఖర్ రాసిన 'ది బుచర్ ఆఫ్ బనారస్' పుస్తకం ఆధారంగా దర్శకుడు ఈ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
1952 నాటి దారుణం.. వర్తమానంలో వరుస హత్యలు
ఈ మండల మర్డర్స్ వెబ్ సిరీస్ కథాంశం ఉత్తర ప్రదేశ్‌లోని 'చరణ్‌దాస్‌పూర్' అనే ఒక ఊహాజనిత పట్టణం నేపథ్యంలో సాగుతుంది. 1952వ సంవత్సరంలో 'ఆయస్తి' అనే ఒక వింత సమూహం.. 'ఆయస్తి యంత్రం', శక్తుల సహాయంతో ఒక మరణించిన వ్యక్తిని తిరిగి బతికించడానికి ప్రయత్నిస్తుంది. ఈ భయంకరమైన చేతబడి అనుష్ఠానాన్ని చూసి భయపడిన గ్రామస్థులు, వారి స్థావరాన్ని తగలేస్తారు.
కట్ చేస్తే.. వర్తమానంలో ఆ పట్టణంలో వరుసగా విచిత్రమైన హత్యలు ప్రారంభమవుతాయి. ప్రతి హత్యలోనూ బాధితుల శరీరాల నుంచి ఏదో ఒక కీలకమైన అవయవాన్ని తీసుకుని, వారి మృతదేహాలపై ఒక ప్రత్యేకమైన 'మండల' (Mandala) గుర్తును వేస్తుంటారు.
ఈ ఘోరమైన కేస్‌ను ఛేదించడానికి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా), డిటెక్టివ్ రియా థామస్ (వాణి కపూర్) రంగంలోకి దిగుతారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడే నిజాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి.
మండల మర్డర్స్ ఎలా ఉందంటే?
2014లో మహేంద్ర జఖర్ రాసిన ప్రసిద్ధ మిస్టరీ నవల 'ది బుచర్ ఆఫ్ బనారస్' (The Butcher of Banaras) ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. అయితే ఒరిజినల్ నవలలోని వాటికన్, ఎఫ్‌బీఐ (FBI) స్టోరీని పక్కనబెట్టి.. మన భారతీయ తంత్ర-మంత్రాలు, రహస్య ఆచారాల నేపథ్యానికి అనుగుణంగా మేకర్స్ మార్పులు చేశారు.
ఇందులో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియ పిల్‌గాంకర్ కీలక పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా 'రుక్మిణి' పాత్రలో నటించిన శ్రియ కేవలం ఐదు సీన్లలోనే కనిపించినప్పటికీ.. కథను మలుపు తిప్పే ఆత్మలా ఆమె పాత్ర నిలుస్తుంది. ఐఎండీబీ (IMDb) లో 6.5 రేటింగ్ దక్కించుకున్న ఈ 'మండల మర్డర్స్' సిరీస్, థ్రిల్లర్ ప్రేమికులకు పండుగ వారాంతంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మంచి చాయిస్. ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


