Netflix Today: నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజు థ్రిల్లర్ మూవీస్, సిరీస్ జాతర.. మలయాళ, తమిళ, హిందీ థ్రిల్లర్లు, క్రైమ్ థ్రిల్లర్లు
Netflix Today Releases October 23rd 2026: నెట్‌ఫ్లిక్స్ లోకి ఈరోజు అంటే అక్టోబర్ 23న థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ జాతర ఉంది. మలయాళ థ్రిల్లర్, తమిళ బోల్డ్ మూవీ, హిందీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతోపాటు ఇంగ్లిష్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
Netflix Today Releases October 23rd 2026: ఓటీటీలో వీకెండ్ ఏం చూడాలా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం (అక్టోబర్ 23) ప్రేక్షకులకు మంచి కంటెంట్ తీసుకొచ్చింది. అందులోనూ థ్రిల్లర్ అభిమానులకైతే మంచి విందు భోజనమే. మరి ఈరోజు వచ్చిన ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

1. మలయాళం టైమ్-లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu)
మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వినూత్న టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు'. సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
తన పెళ్లి రోజే హత్యకు గురయ్యే హీరో, మళ్లీ మళ్లీ అదే రోజు ఉదయానికి చేరుకోవడం, తన చావు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు పుష్కలంగా నవ్వులు, థ్రిల్‌ను పంచుతాయి. అసలు అలా ఎందుకు జరిగింది? దాని వెనుక ఉన్న అసలు కథేంటి అన్నది ఈ మూవీలో చూడొచ్చు.
2. కీర్తి సురేష్ 'డోరతీ' (Dorothy)
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన ఇంటెన్స్ తమిళ సోషల్ క్రైమ్ డ్రామా 'డోరతీ'. 1990ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కుల వివక్ష, సమాజంలో మహిళలు ఎదుర్కొనే అణచివేత, పాత ఆలోచనలను ధిక్కరించే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ మూవీ చూడొచ్చు.
3. లూపిన్: పార్ట్ 4 (Lupin: Part 4)
గ్లోబల్ వైడ్‌గా కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ మిస్టరీ రివేంజ్ థ్రిల్లర్ 'లూపిన్'. ఒమర్ సై (Omar Sy) ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రాంచైజ్ 4వ భాగం అక్టోబర్ 23న స్ట్రీమింగ్ కు వచ్చింది. అర్సేన్ లూపిన్ అనే జెంటిల్‌మన్ దొంగ ప్రేరణతో అస్సానే దియోప్ తన తండ్రిపై పడిన నిందను తొలగించుకోవడానికి, శత్రువుల కుట్రలను ఛేదించడానికి చేసే కొత్త మిషన్ ఈ పార్ట్ 4లో చూపించబోతున్నారు.
4. మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్' (Gajab Raat)
బహుముఖ ప్రజ్ఞాశాలి మనోజ్ బాజ్‌పాయ్, నుస్రత్ భరుచా, సాఖిబ్ సలీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఒకే ఒక్క రాత్రి వేళ పోలీస్ అధికారి తీసుకునే ఓ తొందరపాటు నిర్ణయం ఎంతటి అనర్థాలకు దారితీసింది? సస్పెన్స్, డార్క్ కామెడీతో కూడిన ఆ రాత్రి మిస్టరీ ఏమిటనేది ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
5. సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (Surviving Hurricane Otis)
2023లో మెక్సికోలోని అకాపుల్కో నగరాన్ని వణికించిన భయంకరమైన 'కేటగిరీ-5' హరికేన్ 'ఓటిస్' ఆధారంగా రూపొందించిన నేచురల్ డిజాస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఊహించని విధ్వంసం మధ్య సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, కుటుంబాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


