Akka Trailer: 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం.. కీర్తి సురేష్ బోల్డ్ అవతార్.. రాధికతో ఇంటెన్స్ ఫైట్.. అక్క ట్రైలర్ చూశారా?

Akka Trailer: నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్క ట్రైలర్ వచ్చేసింది. అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ లో కీర్తి సురేష్ ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టార్ రోల్ పోషిస్తుండగా.. ఆమెను సవాలు చేసే మరో శక్తిమంతమైన పాత్రలో రాధికా ఆప్టే నటిస్తోంది.

Published on: Oct 22, 2026, 14:12:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Akka Trailer: కీర్తి సురేష్ మరో బోల్డ్ అవతార్ లో కనిపిస్తున్న వెబ్ సిరీస్ అక్క. ఈ నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ కాగా.. తాజాగా గురువారం (అక్టోబర్ 22) మేకర్స్ ఓ ఇంటెన్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పేర్నూరు అనే ప్రాంతం కోసం జరిగే ఫైట్ ఇందులో చూడొచ్చు.

Akka Trailer: 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం.. కీర్తి సురేష్ బోల్డ్ అవతార్.. రాధికతో ఇంటెన్స్ ఫైట్.. అక్క ట్రైలర్ చూశారా?
Akka Trailer: 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం.. కీర్తి సురేష్ బోల్డ్ అవతార్.. రాధికతో ఇంటెన్స్ ఫైట్.. అక్క ట్రైలర్ చూశారా?

అక్క ట్రైలర్ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్క ట్రైలర్ మొదట్లోనే పేర్నూరు అనే ప్రాంతం గురించి పరిచయం చేశారు. 1985 ప్రాంతంలో జరిగిన స్టోరీగా చూపించారు. ఇక్కడ 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిని అక్క అని పిలుస్తుంటారు. భవాని (కీర్తి సురేష్) నేతృత్వంలో ఆ రాజ్యం నడుస్తుంటుంది. ఆడాళ్లు ఇంటినే కాదు వ్యాపారాన్ని కూడా చక్కదిద్దగలరు అనే డైలాగులు ఈ ట్రైలర్ లో చూడొచ్చు.

అలాంటి అక్క సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి రుద్ర (రాధికా ఆప్టే) రూపంలో మరో లేడీ గ్యాంగ్‌స్టర్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో అక్కడి నుంచి ఫైట్ అక్క, రుద్ర మధ్య మొదలవుతుంది. అక్క సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది రుద్ర. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే ఫైట్ చాలా ఆసక్తి రేపుతుంది. రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్ వెబ్ సిరీస్ పై ఉన్న అంచనాలను పెంచేసింది.

“ఒకరు రాజ్యాన్ని స్థాపిస్తే.. మరొకరు విధ్వంసాన్ని సృష్టిస్తారు. చరిత్ర తిరగరాయబడబోతోంది.. అక్క అక్టోబర్ 20 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ ట్రైలర్ ను షేర్ చేసింది.

భారీ తారాగణం.. అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్

ఈ వెబ్ సిరీస్‌కు ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి తన్వి అజ్మీ సహా పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ధర్మరాజ్ శెట్టి (Dharmaraj Shetty) స్వయంగా రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌తో ఆయన రచయితగా, దర్శకుడిగా డిజిటల్ తెరకు పరిచయమవుతున్నారు. 'పెర్నూర్' (Pernuru) అనే ఒక కల్పిత నగరంలో, మహిళా గ్యాంగ్‌స్టర్ రాణుల పాలనలో సాగే కథాంశంతో అత్యంత పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు.

లేడీ డామినేషన్, గ్యాంగ్‌స్టర్ రివేంజ్, పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న 'అక్క' వెబ్ సిరీస్ అక్టోబర్ 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు రానుంది. కీర్తి సురేష్-రాధికా ఆప్టేల మైండ్ బ్లాకింగ్ కాంబినేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More