Jiohotstar OTT: ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసిన రాధికా ఆప్టే సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్.. రియల్ మిస్టరీ స్టోరీ!
Jiohotstar OTT: ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలను చూసే లవర్స్ కు ఇది కిక్కిచ్చే న్యూస్. ఇంటర్నేషనల్ వైడ్ గా అదరగొట్టిన ‘లాస్ట్ డేస్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ హాలీవుడ్ ఫిల్మ్ జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెట్టింది.
Jiohotstar OTT: రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసిన హాలీవుడ్ సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఏడాది తర్వాత జియోహాట్‌స్టార్‌లోకి వచ్చింది. నేడు అక్టోబర్ 21న ‘లాస్ట్ డేస్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో చూడలేకపోయిన అడ్వెంచర్, సర్వైవల్ సస్పెన్స్ ప్రియుల కోసం ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చింది.

ఏడాది తర్వాత
లాస్ట్ డేస్ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 2025లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఆ తర్వాత అక్టోబర్ 24, 2025న అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
జియోహాట్‌స్టార్‌లోకి
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో లాస్ట్ డేస్ మూవీ ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా రాధికా ఆప్టే క్రేజ్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన కథ కావడంతో హాలోవీన్, పండుగల సీజన్ నేపథ్యలో ఓటీటీలో రిలీజ్ చశారు.
స్టోరీ ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే అండమాన్‌లోని ‘నార్త్ సెంటినల్ ఐలాండ్’ నేపథ్యంలో సాగే ఒక నిజ జీవిత గాథ. 26 ఏళ్ల అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చౌ (స్కై యాంగ్) ఆ ద్వీపంలోని గిరిజనులను కలవాలని, వారికి తన మతాన్ని బోధించాలని ప్రాణాలకు తెగించి ప్లాన్ చేస్తాడు.
అయితే ఆ ద్వీపాన్ని రక్షించడానికి, అక్కడి గిరిజనుల సంస్కృతిని కాపాడటానికి పోలీస్ అధికారి మీరా గనాలి (రాధికా ఆప్టే), స్థానిక డిటెక్టివ్ కలిసి ఇదంతా ఆపడానికి ఎలా ప్రయత్నించారు? చివరికి జాన్ చౌ ఆ ద్వీపంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ లాస్ట్ డేస్ సినిమా కథ.
ట్విస్ట్‌లు అదుర్స్
జాన్ చౌ రహస్య ప్రయాణాన్ని కనిపెట్టడానికి డిటెక్టివ్ మైండ్ గేమ్స్, దానికి రాధికా ఆప్టే పాత్ర ఇచ్చే సపోర్ట్ కథలో ఉత్కంఠను పెంచుతాయి. బయట నుంచి ఎవరు వచ్చినా బాణాలు, ఈటెలతో దాడి చేసే ఆ సెంటినలైజ్డ్ తెగ కంటపడిన జాన్ చౌ చివరి రోజుల్లో (Last Days) అనుభవించిన భయానక పరిస్థితులు గుండెల్ని పిండేస్తాయి.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాన్ అలెన్ చౌ అనే మిషనరీ నిజ జీవిత మరణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నార్త్ సెంటినల్ ఐలాండ్ పరిరక్షణ కోసం పోరాడే పవర్‌ఫుల్ పాత్రలో రాధికా ఆప్టే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.దట్టమైన అడవులు, ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు, అండమాన్ పరిసరాలను దర్శకుడు జస్టిన్ లిన్ స్క్రీన్‌పై చాలా సహజంగా, థ్రిల్లింగ్‌గా చూపించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


