Akka OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కీర్తి సురేష్, రాధికా ఆప్టే క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Akka OTT: ఓటీటీలోకి మరో ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతుంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్.. చాలా గ్యాప్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.
Akka OTT: మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. ఏడాది క్రితం అనౌన్స్ చేసిన ఈ సిరీస్ ఇన్నాళ్లకు రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే.. ‘అక్క’ వెబ్ సిరీస్. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ ప్లే చేశారు. 2025 ఫిబ్రవరిలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజైంది.

అక్క వెబ్ సిరీస్ ఓటీటీ
కీర్తి సురేష్, రాధికా ఆప్టే కలిసి నటిస్తున్న ‘అక్క’ సిరీస్ పై అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరు హీరోయిన్లు మంచి పర్ఫార్మర్లు కావడంతో సిరీస్ పై బజ్ నెలకొంది. అయితే అనౌన్స్ మెంట్ టీజర్ తర్వాత ఈ అక్క సిరీస్ గురించి మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు దీని ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్
క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘అక్క’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సిరీస్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా రెడీ అవుతోంది. ఈ సిరీస్ ను అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. అక్క సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పుడు ట్రెండింగ్ మారింది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
అక్క సిరీస్ స్టోరీ ఏంటంటే?
ఈ అక్క సిరీస్ 1980వ దశకం బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలిసింది. సౌత్ ఇండియాలోని 'పెర్నూరు' (Pernuru) అనే ఒక కల్పిత నగరంలో ఈ కథ జరుగుతుంది. ఇక్కడ మహిళలదే రాజ్యం, గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ ఈ నగరాన్ని ఏలుతుంటారు. ఇందులో కీర్తి సురేష్, రాధికా ఆప్టే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్స్ గా కనిపిస్తారని టాక్.
ఈ శక్తివంతమైన మహిళా సామ్రాజ్యాన్ని సవాలు చేస్తూ ఒక అపరిచిత వ్యక్తి నగరంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వారి మనుగడ కోసం జరిగే హింసాత్మక పోరాటం, ప్రతీకారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
వీళ్లు కూడా
అక్క వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే పవర్‌ఫుల్ ఫేస్-ఆఫ్, శత్రుత్వం ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలవనుంది. వీరితో పాటు సీనియర్ నటి తన్వీ అజ్మీ, విశాఖ్ నాయర్, దివ్యా శ్రీపాద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ను ధర్మరాజ్ శెట్టి రచించి, దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డిజిటల్ వింగ్ అయిన YRF ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది కీర్తి సురేష్ నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


