Shiva Raj Kumar OTT: ఆ సినిమా చూసి ఏడ్చా.. గంట సేపు నిద్రపోలేకపోయా.. ఓటీటీ ట్రెండింగ్ నంబర్ వన్ మూవీపై శివరాజ్ కుమార్
Shiva Raj Kumar OTT: కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ మూవీ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఏకంగా ఏడ్చేశారు. గంట సేపు నిద్రపోలేకపోయారు. ఈ మాటలను శివ రాజ్ కుమార్ స్వయంగా చెప్పారు. ఆయన చెప్పిన మూవీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేసులో ఉంది. అదేంటో ఓ లుక్కేయండి.
Shiva Raj Kumar OTT: సీనియర్ హీరో శివ రాజ్‌కుమార్ ఇటీవల విడుదలైన సూర్య, మమితా బైజుల హిట్ చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) పై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా చూశాక తనకు రాత్రి నిద్రపట్టలేదని శివన్న అన్నారు.

శివన్న ఎమోషనల్
తన కొత్త సినిమా 'బెయిల్' (Bail) అక్టోబర్ 2న విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ శివన్న ఎమోషనల్ అయ్యారు.
సూర్య సినిమా చూసి ఏడ్చేశా
"నేను ఇటీవల 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూశాను. సినిమా చూశాక దాదాపు గంటసేపు నాకు నిద్రపట్టలేదు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు మా అమ్మనాన్నలు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మలతో పాటు మా కుటుంబం గుర్తుకొచ్చింది. భవిష్యత్తులో నేను కూడా ఇలాంటి మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేయాలని అనుకుంటున్నాను" అని శివ రాజ్‌కుమార్ తెలిపారు.
ఓటీటీలో ట్రెండింగ్
కన్నడ లెజెండ్ డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మల పెద్ద కుమారుడైన శివ రాజ్‌కుమార్.. తమ ఉమ్మడి కుటుంబ జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో ఒలింపిక్ పిస్టల్ షూటర్, పారిశ్రామికవేత్త సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య, సరోగసి మదర్ మ్యాడీగా మమితా బైజూ అద్భుతంగా నటించారు.
పెద్ద వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ వారి మధ్య చిగురించే అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
శివన్న జోరు
ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ వరుసగా భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 2న 'బెయిల్' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్న ఆయన, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రాబోతున్న 'జైలర్ 2'లో మరోసారి పవర్‌ఫుల్ కేమియో రోల్ చేయనున్నారు.
వీటితో పాటు తమిళంలో 'పికాసో', తెలుగులో పీరియాడికల్ డ్రామా 'గుమ్మడి నర్సయ్య', కన్నడలో 'డాడ్', '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే క్యాన్సర్‌ను జయించిన తన జీవిత ప్రయాణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న 'సర్వైవర్ - ఏ సూపర్‌స్టార్ డాక్యుమెంటరీ'లోనూ ఆయన కనిపించనున్నారు. ఈ ఏడాదే ఆయన తెలుగులో 'పెద్ది' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


