Venky Atluri: అమెరికాలో రికార్డు.. ఆ భారీ డిజాస్ట‌ర్ దాటి బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా.. వెంకీ అట్లూరి స‌క్సెస్ జ‌ర్నీ

Venky Atluri: 'తొలిప్రేమ' నుంచి 'విశ్వనాథ్ అండ్ సన్స్' వరకు దర్శకుడు వెంకీ అట్లూరిది బ్లాక్ బస్టర్ జర్నీ. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ఈ డైరెక్టర్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి సక్సెస్ జర్నీపై ఓ లుక్కేయండి.

Published on: Aug 18, 2026, 08:59:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Venky Atluri: తెలుగు, తమిళ మూవీ ఇండస్ట్రీల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ చిత్రాలను పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో పట్టు సాధించారు. తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో ఆయన బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు.

అమెరికాలో రికార్డు.. ఆ భారీ డిజాస్ట‌ర్ దాటి బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా.. వెంకీ అట్లూరి స‌క్సెస్ జ‌ర్నీ
అమెరికాలో రికార్డు.. ఆ భారీ డిజాస్ట‌ర్ దాటి బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్‌గా.. వెంకీ అట్లూరి స‌క్సెస్ జ‌ర్నీ

వెంకీ అట్లూరి రికార్డు

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మార్కును దాటింది. ఇక ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద కూడా సంచలన వసూళ్లను సాధిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 1.6 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో వెంకీ అట్లూరి కెరీర్‌లోనే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అగ్రస్థానంలో నిలిచింది.

ఈ సందర్భంలో వెంకీ అట్లూరి సినీ ప్రయాణం, ఆయన తీసిన చిత్రాల బాక్సాఫీస్ ట్రాక్ రికార్డును ఒకసారి పరిశీలిద్దాం.

'తొలిప్రేమ'తో గ్రాండ్ ఎంట్రీ

వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన తొలి చిత్రం 'తొలిప్రేమ'. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పరిమిత బడ్జెట్‌తో రూపుదిద్దుకుని, బాక్సాఫీస్ వద్ద రూ.45 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి సినిమాతోనే వెంకీ అట్లూరి హిట్ డైరెక్టర్‌గా పరిశ్రమలో తన ముద్ర వేశారు.

‘మిస్టర్ మజ్ను’

అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి తీసిన రెండో చిత్రం 'మిస్టర్ మజ్ను'. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దాదాపు రూ.20 నుంచి రూ.21 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించి ఫ్లాప్‌గా మిగిలింది.

‘రంగ్ దే’

నితిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే'. పాండమిక్ పరిస్థితుల తదనంతరం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సగటు వసూళ్లను రాబట్టి, బ్రేక్ ఈవెన్ మార్కుకు సమీపంగా నిలిచి యావరేజ్ హిట్‌గా ముగిసింది.

'సార్ / వాతి'తో పాన్-ఇండియా సక్సెస్

తమిళ స్టార్ ధనుష్, సంయుక్త జంటగా విద్యారంగంలో ప్రైవేటీకరణ అంశంపై వెంకీ అట్లూరి తీసిన ద్విభాషా చిత్రం 'సార్' (తమిళంలో 'వాతి'). ఈ సామాజిక డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్లకు పైగా వసూలు చేసింది. వెంకీ అట్లూరికి ఇది మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది.

'లక్కీ భాస్కర్'తో బ్లాక్‌బస్టర్ హిట్

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఫైనాన్షియల్ డ్రామా నేపథ్యంలో వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ సినిమా రూ. 00 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, వెంకీ అట్లూరి వరుస బ్లాక్‌బస్టర్ల డైరెక్టర్‌గా స్థిరపడటానికి కారణమైంది.

'విశ్వనాథ్ అండ్ సన్స్'తో సరికొత్త రికార్డు

సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో వెంకీ అట్లూరి తీసిన సరికొత్త ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఆడియన్స్ నుంచి వస్తున్న భారీ ఆదరణతో ఈ సినిమా కేవలం రెండే రెండు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

అంతేకాకుండా ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద 1.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టి, వెంకీ అట్లూరి కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్న వెంకీ అట్లూరి.. సౌత్ ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More